HomeinternationalPope Francis : స్వలింగ సంపర్కంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక వ్యాఖ్యలు.. నేరం కాదు.. పాపం అంటూ..!

Pope Francis : స్వలింగ సంపర్కంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక వ్యాఖ్యలు.. నేరం కాదు.. పాపం అంటూ..!

Telugu Flash News

పోప్‌ ఫ్రాన్సిస్‌ (Pope Francis) మరోసారి వార్తల్లో నిలిచారు. స్వలింగ సంపర్కులపై పోప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. స్వలింగ సంపర్కం నేరం కాదు.. పాపం మాత్రమేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే చట్టాలను పోప్‌ ఫ్రాన్సిస్‌ తప్పు పట్టారు. ఇలాంటి చట్టాలకు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. దీంతో ఈ అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది.

తన పిల్లలందరినీ దేవుడు సమానంగా చూస్తాడని పోప్ ఫ్రాన్సిస్‌ తెలిపారు. ఎలాంటి షరతులు కూడా విధించడని చెప్పారు. ఇటీవల అసోసియేటెడ్‌ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొందరు క్యాథలిక్‌ బిషప్‌లు కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలకు మద్దతు ఇస్తున్నారన్న పోప్ ఫ్రాన్సిస్‌.. ఈ విషయం తనకు తెలుసన్నారు.

స్వలింగ సంపర్కులు కూడా మనుషులేనని, వారిపై కఠినంగా వ్యవహరించొద్దని సూచించారు. మృదువుగా వ్యవహరించాలని, వారిని కూడా చర్చిలోకి అనుమతించాలని సూచించారు. ఈ విధానాన్ని పాటించాలని, వారిని స్వాగతించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అగౌరవపరిచేలా వివక్ష చూపొద్దని సూచించారు.

నేరం కాదు.. పాపం

అయితే ఇదే సమయంలో స్వలింగ సంపర్కం పాపం అంటూ పోప్‌ ఫ్రాన్సిస్‌ పేర్కొన్నారు. స్వలింగ సంపర్కం ఒక దృక్కోణమని, ఈ విషయంలో సాంస్కృతిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇతరులపై జాలి, దయ చూపకపోవడం కూడా పాపం కిందకే వస్తుందన్న పోప్‌.. పాపాన్ని, నేరాన్ని వేర్వేరుగా చూడాలని ఉద్బోధించారు. స్వలింగ సంపర్కులను ఇతరులతో సమానంగా గౌరవం పొందేలా చూడాలని పోప్‌ అభిప్రాయపడ్డారు.

-Advertisement-

also read :

Viral Video Today : రోడ్డుపై బుల్లెట్‌ బండితో ఫీట్లు.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్ వీడియో

Tollywood News : చిరంజీవి, బాల‌కృష్ణ‌ల భార్య‌ల‌లో ఈ కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

Pawan Kalyan Varahi: ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వారాహి.. అసలు సంగ్రామం ఇప్పుడు మొదలవుతుందా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News