Poorna: నటి, జడ్జి అయిన పూర్ణ ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కని ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా తన మ్యారేజ్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇటీవల ఆమె షేర్ చేసిన పెళ్లి ఫోటోలు, హల్దీ వేడుకకి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇవి అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకున్నాయి. పూర్ణ భర్త షానిద్ ఆసిఫ్ అలీ.. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ అని తెలుస్తుంది. అయితే ఆమె భర్త పూర్ణకు పెళ్లి కాకముందు కోట్ల రూపాయల ఆస్తులను ఇచ్చారట. పెళ్లికి ముందు ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడనే ఓ ప్రచారం నడుస్తుంది.
ఆన్‌లైన్ మోసం..
దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని సమాచారం. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇవే కాకుండా ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడని, వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి గత కొద్ది రోజులుగా పూర్ణ తన పెళ్లి విషయాలతో తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఆమె భర్త పేరుతో కొన్ని ఆన్‌లైన్ మోసాలు జరిగినట్టు ఓ ప్రచారం జరగగా, దీనిపై పూర్ణ స్పందించింది. పూర్ణ అలియాస్ షమ్నా కాసిం భర్త పేరుతో వాట్సాప్‌లో కొన్ని మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవి కూడా ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లే. వీటిపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని పూర్ణ హెచ్చరిస్తున్నారు.
దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని నటి పూర్ణ గతనెల 24న పెళ్లాడిన పూర్ణ.. తన భర్త కంపెనీకి సంబంధించిన ఈవెంట్లను కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. అది తన భర్త పేరుతో జరుగుతున్న సైబర్ మోసానికి సంబంధించిన పోస్ట్ కాగా, ఇందులో +971 52 724 5366 ఫోన్ నంబరు కలిగిన వాట్సాప్ అకౌంట్ ద్వారా తన భర్త షానిద్ పేరుతో ఒకరు కాంటాక్ట్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని.. అది తన భర్త కాదని.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పూర్ణ తన పోస్ట్‌లో తెలియజేసింది. ఈ ప్రొఫైల్‌తో మీరు ఏవైనా లావాదేవీలు జరిపితే దానికి తన భర్త ఎట్టిపరిస్థితుల్లో బాధ్యుడు కాడంటూ కూడా పూర్ణ స్పష్టం చేసింది.