Poonam Kaur: నటి పూనమ్ కౌర్ నటిగా కన్నా కూడా సంచలన వ్యాఖ్యలతో వార్తలలో నిలిచి నానా రచ్చ చేస్తుంటుంది. తాజాగా అబార్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేస్త అందరి దృష్టిని ఆకర్షించింది.
సుప్రీంకోర్ట్ రీసెంట్‌గా అబార్షన్‌పై కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్‌కు మహిళలు ఎవరైనా అర్హులేనని తెలియజేస్తూ…ఒంటరి, అవివాహిత మహిళలు కూడా అబార్షన్ చేసుకునే హక్కు వారికి ఉందంటూ స్పష్టం చేసింది.
ఎవరిని ఉద్దేశించి..
ఇక ఇక్కడ చిన్న విషయం కూడా చెప్పింది. రూల్స్ ప్రకారం 24 వారాల గర్భాన్ని మాత్రమే తొలగించుకునే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే దీనిపై పూనమ్ కౌర్ చేసిన వాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె ఎవరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్పందించిన పూనమ్.. నేను మద్దతు ఇస్తున్నా. స్త్రీలు పెళ్లిని, ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు గర్భం దాల్చడం చూసినట్టు తెలియజేసిన పూనమ్ కౌర్. వ్యక్తి తన జీవితమంతా అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుందని పేర్కొంది.
స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయ్యే ఆయుధంగా ఉపయోగించుకోకూడదంటూ చురకలంటించింది. తరచుగా పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్ట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఆమె పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లు పోస్ట్ లు పెడుతుంది.
ఈ అమ్మడు ఎక్కువగా, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అప్పట్లో కత్తి మహేష్.. పూనమ్-పవన్ రిలేషన్ బయటపెడుతూ సంచలన ఆరోపణలు చేయగా, పూనమ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఇక అప్పటి నుండి పూనమ్ స్పందిస్తూ ఉంటుంది.
కొన్నేళ్ల గ్యాప్ తీసుకుని ఈమె నటించిన సినిమా నాతిచరామి అనే చిత్రంలో నటించింది. నాగు గవర తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వార్తలు లేవు.