Telugu Flash News

Pooja Hegde: డిప్రెష‌న్ నుండి బ‌య‌టప‌డేందుకు శ్రీలంక వెళ్లిన పూజా హెగ్డే.. అక్క‌డ ఏం చేస్తుందంటే..!

pooja hegde

Pooja Hegde: కొన్ని రోజుల క్రితం వ‌రుస హిట్స్ తో దూసుకుపోయిన పూజా హెగ్డేకి వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. పూజా లేటెస్ట్ రిలీజ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం కూడా నిరాశపరిచింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆశించిన స్థాయిలో ఆడకపోవ‌డంతో పూజా కెరీర్ ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. వ‌రుస‌గా ఆరు ఫ్లాపులు పూజా హెగ్డేని ప‌ల‌క‌రించ‌డంతో ఈ అమ్మ‌డు డిప్రెషన్ కి గురయ్యారని సమాచారం.

కెరీర్ ప్రమాదంలో పడగా ఎలా కమ్ బ్యాక్ కావాలన్న ఆలోచనతో ఉన్న పూజా హెగ్డే మాన‌సిక ఒత్తిడి నుండి బ‌య‌ట ప‌డేందుకు శ్రీలంక టూర్ వెళ్లార‌ట‌. అక్క‌డ‌ ట్రెడిషనల్ వేర్లో పూజా సరికొత్తగా దర్శనమిస్తూ అల‌రిస్తుంది. పిక్స్ లో చూస్తే పూజా సంతోషంగానే క‌నిపిస్తుంది. కాగా, రాధే శ్యామ్ మూవీతో ఆమె సక్సెస్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. రాధే శ్యామ్ ఫ్లాప్ త‌ర్వాత ఆచార్య చిత్రం కూడా ఆమెకు నిరాశ మిగిలిచ్చింది. అనంత‌రం విజయ్ హీరోగా వ‌చ్చిన బీస్ట్, బాలీవుడ్ చిత్రం సర్కస్ ఇలా పూజా న‌టించిన వ‌రుస చిత్రాలు ఫ్లాపులుగా మారాయి. ప్ర‌స్తుతం మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ చిత్రంలో న‌టిస్తుండ‌గా, ఈ మూవీ అయిన పూజాకి మంచి విజ‌యం అందిస్తుందేమో చూడాలి.

Exit mobile version