HomecinemaPooja Hegde: ఆ పార్ట్‌కి స‌ర్జ‌రీ చేయించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న పూజా హెగ్డే..!

Pooja Hegde: ఆ పార్ట్‌కి స‌ర్జ‌రీ చేయించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న పూజా హెగ్డే..!

Telugu Flash News

Pooja Hegde: చాలా త‌క్కువ సమ‌యంలో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. కెరీర్ మొద‌ట్లో పెద్ద‌గా విజ‌యాలు అందుకోలేక‌పోయిన పూజాని త్రివిక్రమ్ పిలిచి మరీ అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు.. ఆ మూవీ హిట్ కావ‌డంతో పూజా ద‌శే తిరిగింది.

ఇక అక్కడి నుండి వ‌రుస స‌క్సెస్ లు సాధిస్తూ గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. అయితే కొద్ది రోజుల వ‌ర‌కు పూజా హ‌వా సాగ‌గా, రాధే శ్యామ్ నుండి ఈ అమ్మ‌డికి బ్యాడ్ సెంటిమెంట్ న‌డుస్తుంది. రాధే శ్యామ్ మూవీతో మొదలైన ఆమె ప్లాప్స్ పరంపర ఆచార్య వరకు కొనసాగింది.

స‌ర్జరీకి సిద్ధ‌మా?

బీస్ట్, ఆచార్య డిజాస్టర్స్ కావ‌డంతో .. ప్లాప్స్ లో హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఫ్లాపులు వ‌చ్చినా కూడా పూజా హెగ్డేకి ఆఫ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. హిందీ, తెలుగు భాష‌ల‌లో అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూనే ఉంది. జనగణమన చిత్రానికి పూజా ఏకంగా రూ. 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

ఇక పూజా హీరోయిన్ గా అనుకున్న భవదీయుడు భగత్ సింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. అయితే పూజ హెగ్డేను ఐరన్ లెగ్ అంటూ ఇటీవ‌ల బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూజ హెగ్డే లో కొన్ని మైనస్ విషయాలను కూడా ప్ర‌స్తావిస్తున్నారు.

పూజా హెగ్డే ముక్కు గురించి కొంద‌రు దారుణ‌మైన కామెంట్స్ చేస్తున్న‌ట్టు ఇటీవల వార్త‌లు వ‌చ్చాయి. పూజ హెగ్డే ముక్కు సరిగా లేదని ఆమె ముఖానికి అదే మైనస్ అని అంద‌రు అనుకుంటున్న నేప‌థ్యంలో తన ముక్కును ఎలాగైనా అందంగా మార్చుకోవాలి అని బుట్ట‌బొమ్మ భావిస్తుంద‌ట‌.

పూజా హెగ్డే తన ముక్కుకి సర్జరీ చేయించుకోవడానికి రెడీ అవుతున్నట్టు స‌మాచారం. ఈ విషయం అఫీషియల్ గా బయటకు రాకపోయినా.. ప్రస్తుతం ఇదే విషయం ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌రి దీనిపై పూజా హెగ్డే ఏమైన స్పందింస్తుందా అనేది చూడాలి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News