‘Ponniyin Selvan 2’ Review: మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి విజయాన్ని అందుకోగా, ఈ రోజు రెండో పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ సాంగ్స్‌తో భారీ అంచనాలని ఈ చిత్రం అందుకుంది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. మరి ఈ చిత్రం కథ ఎలా ఉందో చూద్దాం.
కథ:
రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు చోళనాడు యువరాజు అరుణ్మోజి వర్మన్ ని చంపాలని చూస్తాడు. యువరాజును కాపాడే బాధ్యత వల్లవరాయన్(కార్తీ) తీసుకుంటారు. సముద్రంలో ప్రత్యర్ధులతో జరిగిన యుద్ధంలో అరుణ్మోజి( జయం రవి) మరణించాడని అందరు అనుకుంటారు. అప్పుడు అరుణ్మోజి మరణానికి ప్రతీకారంగా ఆదిత్య కరికాలన్(విక్రమ్) ఏం చేశాడు? అసలు చోళులపై నందిని(ఐశ్వర్య రాయ్) పగ ఎందుకు పెంచుకున్నారు? ఆదిత్య కరికాలుడిని చంపి, చోళనాడును ఆమె ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది? అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్:
ప్లస్ పాయింట్స్:
నటీనటుల పర్‌ఫార్మెన్స్
రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్
ఫైనల్‌గా..
పార్ట్ 1 అరుళ్మోజి, వల్లవరాయన్ ప్రమాదంలో ఉన్నట్లు ముగించగా, ఇప్పుడు వారిని కాపాడేందుకు ఓ మహిళ వచ్చినట్లు చూపించారు. చోళ నాడు మాత్రం అరుళ్మోజి చనిపోయినట్లు భావిస్తుంది. యువరాజు మరణించిన నేపథ్యంలో రాజ్యంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు పొన్నియిన్ సెల్వన్ 2 లో చూపించారు. పార్ట్ 1లో స్లోగా వెళ్లిన కథ రెండో భాగంలో మాత్రం పుంజుకుంది. అయితే ఇంకాస్తా ట్రిమ్ చేస్తే బాగుండేది. సెకండ్ పార్ట్‌లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. తమిళ ఆడియన్స్ ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. మిగతా భాషల ఆడియన్స్ ని ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE
also read :