pomegranate benefits : ఇటీవల ఎక్కడ చూసినా హార్ట్ అటాక్ కేసులు చూస్తున్నాం. గుండెపోటు రాకుండా సరైన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి. దానిమ్మ పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండ్లు రోజూ తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేస్తుంది. దానిమ్మ మొక్కలు ఇరాన్, భారత్ నుంచి వచ్చినట్లు తేలింది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి.
1. ఓ చిన్న కప్పు దానిమ్మ గింజల్లో 72 కేలరీలు ఉంటాయట. దాంతోపాటు పిండి పదార్థాలు 16 గ్రాములుంటాయి.
2. దానిమ్మ గింజల్లో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
3. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె సంబంధిత జబ్బులు వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ అంత తేలిగ్గా కరిగిపోదు.
4. దానిమ్మ పండ్లు రోజూ మూడు తింటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
5. రోజూ తినడం అంటే కొంచం బోర్, ఖర్చు అనిపించినా గుండె జబ్బుల ప్రమాదం ఉన్న వారు తప్పనిసరిగా చేయాలి.
6. బాడీకి వేడి చేస్తుందని భావించే వారు జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇమ్యూనిటీ పెంచడానికి కూడా దానిమ్మ తోడ్పడుతుంది.
also read :
Rana: సమంత మయోసైటిస్‌పై స్పందించిన రానా.. సమస్యలు అందరికి ఉంటాయంటూ కామెంట్
Priya Prakash Varrier Latest Images, Photo gallery 2023