Telugu Flash News

Police:విరాట్ భార్య‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌ల‌కి పోలీసుల వార్నింగ్‌.. ఎందుకంటే..!

Police:సినిమా సెల‌బ్రిటీలు అప్పుడ‌ప్పుడు వివాదాల బారిన ప‌డుతుంటారు. తాము ఏం చేసిన న‌డుస్తుంద‌నే భావ‌న‌లో కొంద‌రు ఉంటున్న క్ర‌మంలో పోలీసులు సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోవ‌ల‌సి వ‌స్తుంది. ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌ల‌న వారు చేసిన చిన్న త‌ప్పులు కూడా ఇట్టే బ‌య‌ట ప‌డుతున్నాయి. తాజాగా పబ్లిసిటీ మత్తులో బాలీవుడ్ స్టార్స్ చేసిన పనికి… పోలీసులు సుతిమెత్తగా వార్నింగ్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చ‌చింది. మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలే త‌ప్ప మీరు చేసే ప‌నుల వల్ల నలుగురు చెడిపోవద్దు కదా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంత‌కు జ‌రిగిన విష‌యం ఏంటంటే.. అమితాబ్, అనుష్క శర్మ ల‌కి పోలీసులు కూల్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఓ షూటింగ్ కి లేట్ అవుతుందని, కారులో నుంచి దిగి మ‌రి బైక్ పై లిఫ్ట్ అడిగి అమితాబ్ లొకేషన్ కి చేరుకోగా, ఆ స‌మ‌యంలో అత‌ను హెల్మెట్ లేకుండా ప్రయాణం చేశారు. ఇది ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.

మరో సందర్భంలో.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శర్మ కూడా ఇలానే హెల్మెట్ లేకుండా జర్నీ చేయ‌డంతో మండిప‌డుతున్నారు. ఆమె కూడా బైక్ పై వెనకాల కూర్చుని వెళ్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చి.. సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా, దానిపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. రెండు సందర్భాల్లోనూ అదీ కూడా అమితాబ్, అనుష్క శర్మ లాంటి స్టార్స్ నిబంధనలు అతిక్రమించే సరికి పోలీస్ శాఖ గట్టిగానే బ‌దులు ఇచ్చింది. కొంత మంది నెటిజన్లు ఈ విషయాన్ని గట్టిగా పట్టుకుని… ముంబయి పోలీసులని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయ‌డంతో అమితాబ్, అనుష్కలపైన వారు గరం కావ‌లసి వ‌చ్చింది.

నెటిజన్ల ప్రశ్నలకు ముంబై పోలీసులు బదులిస్తూ.. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ హెల్మెట్ లేకుండా జర్నీ చేశారు కాబట్టి.. హెల్మెట్ ధరించనందుకు ఫైన్ వేసి వదిలేస్తారే త‌ప్ప పెద్ద యాక్ష‌న్ తీసుకునే ఛాన్స్ లేద‌ని కొంద‌రు అంటున్నారు. బిగ్ బీ అమితాబ్ ఈ వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న ఎన‌ర్జీ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె లో కూడా అమితాబ్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇక విరాట్ స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ విష‌యానికి వ‌స్తే ఈ అమ్మడు ప్ర‌స్తుతం సినిమాలు త‌గ్గించింది. కేవ‌లం త‌న కూతురి బాగోగులు చూసుకుంటూ సంతోషంగా టైం స్పెంట్ చేస్తుంది.

Exit mobile version