Telugu Flash News

Ashish Vidyarthi : 60 ఏళ్ల వ‌య‌స్సులో ప్రేయ‌సిని పెళ్లాడిన పోకిరి విల‌న్

Ashish Vidyarthi marriage

Ashish Vidyarthi marriage

Ashish Vidyarthi : ఈ మ‌ధ్య సెల‌బ్రిటీలు వ‌య‌స్సుతో సంబంధం లేకుండా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. దాదాపు ప‌ది నుండి ప‌దిహేను సంవ‌త్స‌రాల గ్యాప్ ఉన్న వారిని సైతం వీరు ప్రేమించ‌డం పెళ్లిళ్లు చేసుకోవ‌డం అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. గ‌త కొద్ది రోజులుగా న‌రేష్‌, ప‌విత్ర‌ల వ్య‌వ‌హారం ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. వీరి గురించి తెగ చ‌ర్చ‌లు న‌డుస్తున్న స‌మ‌యంలోనే పోకిరిలో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా న‌టించిన ఆశిష్ విద్యార్ధి 60 ఏళ్ల వ‌య‌స్సులో త‌న ప్రేయ‌ని రెండో వివాహం చేసుకొని అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చాడు. అస్సాంకు చెందిన రూపాలీ బారువా అనే మహిళతో మే 25న ఆశిష్ వివాహం జరిగింది. సన్నిహితులు, కుటుంబ స‌భ్యుల సమక్షంలో ఈ వేడుక జరగ్గా.. రూపాలీతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

అలనాటి నటి అయిన శకుంతల బారువా కూతురు రాజోషి బారువా ఆశిష్ విద్యార్ధి మొదటి భార్య అనే విషయం తెలిసిందే. ఆమెతో కొన్ని కార‌ణాల వ‌ల‌న విడిపోయారు. ఇప్పుడు గౌహతికి చెందిన రూపాలీని రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఆమె ప్ర‌స్తుతం కోల్‌కతాలో ఒక హై లెవెల్ ఫ్యాషన్ స్టోర్‌ను నిర్వహిస్తోంది. ఆశిష్‌, రూపాలి రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. జీవితంలోని ఈ మలి దశలో రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు ఆశిష్‌. తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, దాని గురించి తర్వాత ఎప్పుడైనా చెబుతానని అన్నాడు ఆశిష్‌. ఇక ఆశిష్ విష‌యానికి వ‌స్తే..1962లో జన్మించిన ఆశిష్ విద్యార్థి సుమారు మూడున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో స‌క్సెస్ ఫుల్‌గా రాణిస్తూ వ‌స్తున్నాడు. ఆశిష్ విద్యార్థి పాపే నా ప్రాణంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన కూడా పోకిరి సినిమాతో ఫేమస్ అయ్యారు.

ఆశిష్ విద్యార్థి అనేక భాషల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ, బెంగాలీలో దాదాపు 300 సినిమాలు చేశారు. ఆశిష్ విద్యార్థి విలన్ గా, సహా నటుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. తెచ్చుకున్నాడు. ఆశిష్ విద్యార్థి కేరళకు చెందిన వ్యక్తి కాగా, ఆయన కేరళ లోని తెళ్లిచెర్రిలో 1967 ఫిబ్రవరి 12 న జన్మించారు. ిక 2014 అక్టోబరు 20న ఆశిష్ విద్యార్థి పెద్ద ప్ర‌మాదం నుండి బయటపడ్డారు. భిలాయి సమీపంలో బాలీవుడ్ డైరీ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆశిష్ నదిలో నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా నటిస్తున్నప్పుడు నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెర‌గ‌డంతో ఆశీష్ నీటిలో పడిపోయారు.. అప్పుడు అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్.. వికాస్ సింగ్ వెంటనే అప్రమత్తమై ఆశిష్‌ని కాపాడారు. ఈయ‌న మ‌న తెలుగులోను చాలా సినిమాల‌లోనే న‌టించారు.

read more news :

today horoscope in telugu : 26-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Priyanka Chopra: నా ‘లో’ దుస్తులు ఆ డైరెక్ట‌ర్ చూడాల‌ని అనుకున్నాడు

Exit mobile version