Telugu Flash News

PM Modi : జై బజరంగ్‌ బలి.. కర్ణాటకలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించిన ప్రధాని మోదీ..

narendra modi

PM Modi : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అధకార పార్టీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తాజాగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో రిలీజ్‌ చేసింది.

ఇందులో బజరంగ్‌ దళ్‌ను బ్యాన్‌ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చర్యలు తీసుకుంటామంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఇచ్చారు. జై బజరంగ్‌ బలి.. అంటూ కాంగ్రెస్‌ పార్టీపై సెటైర్లు వేశారు నరేంద్ర మోదీ.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా అకస్మాత్తుగా బీజేపీ తన వ్యూహాన్ని మార్చడంతో కాంగ్రెస్‌ అవాక్కవుతోంది. బజరంగ్‌ దళ్‌ను బ్యాన్‌ చేస్తామన్న కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీని ప్రస్తావించిన ప్రధాని.. కర్ణాటకలో అధికారంలోకి కాంగ్రెస్‌ వస్తే అశాంతి రాజ్యమేలుతుందని చురలకంటించారు.

టెర్రరిస్ట్‌ నేతలకు కాంగ్రెస్‌ ఆశ్రయం కల్పిస్తుందని ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. పెట్టుబడిదారులు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పారిపోతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వస్తే పెట్టుబడులే రావని మోదీ చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి చోటా మోదీ బజరంగ్‌ బలి నినాదాన్ని ఎత్తుకుంటున్నారు.

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.ఈ నేపథ్యంలో నేడు దక్షిణ కన్నడ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా బజరంగ్‌ బలి స్లోగన్‌ను ఎత్తుకున్నారు ప్రధాని మోదీ. బీజేపీని ప్రజలు ఆదరించాలని, అధికారాన్ని అప్పగించాలని కోరారు.

కర్ణాటకలోని హొస్పేట్‌లో ప్రధాని మాట్లాడారు. శ్రీరామచంద్రుడితో కాంగ్రెస్‌కు సమస్య రావడం దేశ దౌర్భాగ్యమన్నారు. ఇంతకుముందు జై శ్రీరామ్ నినాదాలు చేసేవారిని లాక్కెళ్లేవారని, ఇప్పుడు జై బజరంగ్‌ బలి నినాదాలు చేసేవారిని లాక్కెళ్లాలని నిర్ణయం తీసుకున్నారంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు ప్రధాని.

ఎన్నికలు సమీపిస్తుండడంతో అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రచారంలో దూసుకెళ్తోంది. మేనిఫెస్టో రిలీజ్‌ చేయగానే బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బజరంగ్‌ దళ్‌ను బ్యాన్‌ చేస్తామన్న కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది.

ఇదే అంశంపై రేపు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేపు సాయంత్రం అన్ని ఆలయాల్లో హనుమాన్‌ చాలీసాను పఠించాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ప్రజల్లో మతంపై మరోసారి చిచ్చు రగుల్చుతున్నారని మేధావులు ఇరు పార్టీలపై మండిపడుతున్నారు.

also read :

Pushpa2: ఇది క‌దా బ‌న్నీ క్రేజ్.. రికార్డ్ ధ‌ర‌కి పుష్ప‌2 ఆడియో రైట్స్..!

Manobala: ఫేమ‌స్ క‌మెడీయ‌న్ మ‌నోబాల కన్నుమూత‌.. షాక్‌లో సినీ ప్రియులు

 

Exit mobile version