సృష్టి మెంధేకర్ మరియు ప్రియాన్షా మిశ్రా ‘ఆన్ హర్ వే’ (On Her Way) అనే మహిళా ప్రయాణాలకు మద్దతు ఇచ్చే సంస్థకు వ్యవస్థాపకులు, ఇది మహిళా ప్రయాణికులను స్థానిక ఆడవారితో అనుసంధానించే ప్లాట్‌ఫారమ్, ఈ వేదిక ద్వారా మహిళా ప్రయాణికులకు ఏదైనా సమాచారం అందించడానికి వారికి సహాయం చేయడంతో పాటు సురక్షితమైన ప్రదేశాల గురించి అవగాహన కల్పిస్తుంది.
ఎక్కువగా ప్రయాణాల మీద ఆసక్తి ఉన్న వీళ్లిద్దరు ‘ఆన్ హర్ వే’ స్థాపించి మహిళలకు సురక్షితమైన ఒంటరి ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదికను ప్రారంభించారు.
మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అయిన సృష్టి, ప్రియాన్షా ఓ స్టార్టప్‌లో ఇంటర్న్షిప్ ద్వారా పరిచయమయ్యారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, ప్రియాన్షా మైక్రోసాఫ్ట్‌లో చేరింది, అక్కడ ఆమె మూడు సంవత్సరాలు టెక్నికల్ సేల్స్ మరియు ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తే, సృష్టి గ్లిచ్ (WPP)లో చేరింది, ఇది మహిళా-కేంద్రీకృత బ్రాండ్‌లకు మార్కెటింగ్ చేసే సంస్థ.
“మా తల్లిదండ్రులకు ఎక్కువగా బదిలీలు అయ్యే ఉద్యోగాలు దానివల్ల భారతదేశంలోని 20+ రాష్ట్రాలకు వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూసిన తర్వాత, మేము ఈ సంస్థ గురించి ఆలోచించాం”.
భద్రత గురించి ఆలోచనలను ప్రేరేపించిన ఒక ప్రత్యేక సంఘటనను సృష్టి మీడియాతో పంచుకుంది ఇతర మహిళా స్నేహితులతో కలిసి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో, ఈ బృందం ఒక హాస్టల్‌లో బస చేసింది. సృష్టి స్నేహితుల్లో ఒకరు రెండు గంటల తర్వాత బాత్రూమ్ కిటికీలోని గాజు డబుల్ వ్యూ అని గుర్తించింది!
ప్రియాంషకు, లడఖ్ పర్యటనలో ఇటువంటి పరిస్థితి ఎదురైంది. “నేను ఉండడానికి సురక్షితమైన స్థలాల కోసం వెతుకుతున్నప్పుడు. ఆన్‌లైన్‌లో ఈ సమాచారాన్ని కనుగొనడంలో నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను. కొన్ని మంచి రేటింగ్ తో ఉన్న హోటళ్లు ఉన్నాయి కానీ నేను ఇంకొన్ని రివ్యూస్ వెనక్కి వెళ్లిన తర్వాత నాల్గవ పేజీలో ఒక రివ్యూ చూసాను. “ఏరియాలో వీధిలైట్లు లేవు” అని ఉంది.
ఆ రివ్యూ ఇటువంటి ప్రదేశాల్లో మహిళల భద్రత గురించి నాకు భయాన్ని పెంచింది.
ప్రయాణంలో స్త్రీలు మరియు పురుషుల ఆందోళనలు చాలా విభిన్నంగా ఉంటాయని మా అనుభవాలు మాకు అర్థమయ్యేలా చేశాయి అని ఇద్దరు అన్నారు.
ప్రయాణాల్లో మహిళల అవసరాలు, సమస్యలు మగవారికి భిన్నంగా ఉంటాయి అయితే ప్రస్తుత ప్రయాణ వ్యవస్థ పురుషులచే రూపొందించబడింది అది మహిళలకు అనుగుణంగా లేదని సృష్టి అభిప్రాయ పడ్డారు.
అది మార్చడానికి వీరు ఇద్దరు ఒక ప్రణాళికను రూపొందించిన తర్వాత, యువ పారిశ్రామికవేత్తలు అభిప్రాయాన్ని కోరారు. అలా ఆన్ హర్ వే’ జనవరి 2022లో ప్రారంభించబడింది.
మహిళల ప్రయాణంలోని వివిధ అంశాలను పరిశోధించడం వంటివి చేసిన తర్వాత ఇద్దరూ తమ ఉద్యోగాలను 2022 మధ్యలో వదిలి పూర్తి సమయం ఈ వేదిక కోసం కేటాయించడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత, వారు ఐఐఎం బెంగళూరు ద్వారా కూడా ఈ ఆలోచనను అమలు చేశారు.
ప్లాట్‌ఫారమ్‌పై ప్రారంభించిన కాన్సెప్ట్‌లలో ఒకటి ‘లోకల్ గల్ పాల్’, ఇది ప్లాట్‌ఫారమ్‌పై నమోదు చేసుకున్న ఒంటరి మహిళా ప్రయాణికులు వారి ప్రయాణ గమ్యస్థానంలో స్థానిక మహిళతో పరిచయం అయ్యేలా చేస్తుంది. ఆ స్త్రీ అవసరమైన మొత్తం సమాచారాన్ని అందజేస్తారు మరియు ఎల్లప్పుడూ సహాయం అందుబాటులో ఉండేలా చూస్తారు. ఈ సేవ ఇప్పుడు ‘ఆన్ హర్ వే’ సంఘం సభ్యులకు ప్రత్యేకంగా అందించబడుతుంది. ఈ ‘ ‘లోకల్ గల్ పాల్’ లో ఉండే స్థానిక స్త్రీని అన్ని రకాల బాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత ఉపయోగిస్తారు.
ఆన్ హర్ వే కమ్యూనిటీలో 3,000+ మంది మహిళలు ఉన్నారు ఈ వేదిక వివిధ ప్రోగ్రామ్‌ల ద్వారా మరింత మెరుగ్గా ప్రయాణించడంలో వారికి సహాయపడుతుంది.
ఇద్దరు మహిళా ఉద్యోగులు, వారి వెంచర్‌లో కొంత మంది ఇంటర్న్‌లు పనిచేస్తున్నారు, సంఘం కోసం విభిన్న కార్యక్రమాలను నిర్వహించడం మరియు రూపొందించడం కూడా చురుకుగా ప్రారంభించారు. ఇటీవల, వారు గోవాలో SafeSpaces ను ప్రారంభించారు, ఇది చాలా ప్రశంసలను అందుకుంది.
“ఈ చొరవతో, గోవా టూరిజంలో భాగమైన నైట్‌లైఫ్‌ను మహిళా ప్రయాణికులకు సురక్షితంగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము జాగ్రత్తగా 10 బార్‌లను ఎంచుకుని, మహిళలకి ఎలాంటి ఇబ్బందులు లేని సురక్షితమైన స్థలాన్ని సృష్టించేందుకు వారితో కలిసి పనిచేశాము.” అని ప్రియాంష చెప్పారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలు మరియు ప్రయాణ గమ్యస్థానాలలో మరియు 2023 చివరి నాటికి ఆసియా అంతటా ‘ఆన్ హర్ వే’ కమ్యూనిటీని పెంచాలని సృష్టి మరియు ప్రియాంశ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సంస్థకు గ్రాడ్‌క్యాపిటల్ మద్దతు మరియు నిధులు సమకూరుస్తుంది.