Payal Rajput : ప్రభాస్ అంటే ఇష్టం.. కొందరు దర్శకులు నన్ను వాడుకున్నారు.. పాయల్ తాజా ఇంటర్వ్యూ లో సంచలన విషయాలు
TFN
Payal Rajput : 2018 లో ‘ఆర్ఎక్స్ 100’ థియేటర్లలో విడుదలైంది. ఆ ఇయర్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందాల విందుతో పాటు అద్భుతమైన నటనను కనబరిచిన పాయల్ రాజ్పుత్ గురించే అప్పట్లో అందరూ మాట్లాడుకున్నారు. రాత్రికి రాత్రే స్టార్ డమ్ వచ్చింది ఈ భామ కి. రానున్న రోజుల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరుతుందని అంతా అనుకున్నారు కానీ అది నిజం కాలేదు. అయితే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఆమెకు అభిమానుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాల ఎంపిక సరిగా లేకపోవడంతో పాయల్ వెనక్కి తగ్గింది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చెప్పింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రి లో కొంతమంది నన్ను తప్పుదోవ పట్టించారు. ఆ సినిమా సక్సెస్ అయిన వెంటనే నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ కొందరు వ్యక్తులు సినిమాల ఎంపికలో నన్ను తప్పుదారి పట్టించారు. ఫలానా సినిమా మాత్రమే చూడమని సలహా ఇచ్చేవారు. చివరకు కొందరు దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించారని, అప్పట్లో నా ఫేమ్ ను వాడుకున్నారని పాయల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం అన్ని విధాలుగా ఆలోచించే సినిమాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పాయల్ తెలిపింది. ఇప్పుడు తనకు టాలీవుడ్లో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పింది. ఎలాంటి సినిమాలు చేయాలనేది ఆలోచించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలిపింది. సినిమా రంగంలో పైకి వెళ్తే.. కిందికి పడిపోవడం సహజం. అయితే వాటిని భరిస్తానని చెప్పింది ఈ బ్యూటీ.
నెగెటివిటీని వదిలి సానుకూలంగా ఆలోచించి ముందుకు సాగాలని ఆమె అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’తో లైఫ్ ఇచ్చిన అజయ్ భూపతికి మరో అవకాశం ఇచ్చింది పాయల్ . వీరిద్దరి కాంబో మళ్లీ ‘మంగళవారం’ సినిమాతో రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని ప్రభాస్ పాయల్ వ్యాఖ్యానించింది. ప్రభాస్తో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అతని హైట్ కి పర్ఫెక్ట్ గా సరిపోతానని అంటోంది ఈ బ్యూటీ. గతంలో చాలా ఇంటర్వ్యూలలో ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది ఈ బ్యూటీ. తనకు బన్నీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ తెలిపింది.