HomecinemaPawan Kalyan: బాల‌కృష్ణ‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Pawan Kalyan: బాల‌కృష్ణ‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Telugu Flash News

Pawan Kalyan: సీనియ‌ర్ హీరో నంద‌మూరి హీరో బాల‌కృష్ణ ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఆహా వేదిక‌గా అన్‌స్టాప‌బుల్ అనే షో చేస్తున్న విష‌యం తెలిసిందే. . వెండితెర‌పై త‌న యాక్ష‌న్ తో అభిమానుల‌ను ఉర్రూత‌లూగిస్తున్న బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌ షోలో త‌న కామెడీ టైమింగ్ తో వీక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించాడు.

త‌న మార్కు అల్ల‌రితో పాటు, పంచ్ డైలాగ్స్ తో షోను సూప‌ర్ స‌క్సెస్ అయ్యేలా చేశారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అయిన అన్‌స్టాప‌బుల్ లో చాలా మంది సెల‌బ్రిటీలు సంద‌డి చేయ‌గా, వారితో ద‌బిడి దిబిడి అనిపించాడు బాల‌య్య‌.

ఇక ర‌చ్చ ర‌చ్చే..

ఇక అన్‌స్టాప‌బుల్ 2 త్వ‌ర‌లో మొద‌లు కానుంద‌ని రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. కొత్త సీజ‌న్ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా తెలియ‌జేయ‌లేదు. పండ‌గ త్వరలోనే మొద‌వుతుంది… అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించి ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది.. ఈ నేప‌థ్యంలో ద‌సరా లేదా దీపావ‌ళికి కొత్త సీజ‌న్ ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా అంటూ బాల‌య్య మార్కు డైలాగ్ మాదిరి హ్యాష్‌ట్యాగ్ ను కూడా జ‌త చేశారు. మొత్తానికి త్వ‌ర‌లోనే ఇది మొద‌లు కానుంద‌ని తెలుస్తుండగా, ఇందులో పాల్గొన‌బోయే వారి గురించి వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా ఓటీటీ టీం వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఈ షో కోసం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్ప‌టికే తొలి సీజ‌న్‌కి మంచి పేరు రావ‌డంతో ఇప్పుడు షోకి పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ వంటి స్టార్స్ కలిసి రావడంతో షో యొక్క స్థాయి మరింతగా పెరగడం ఖాయం అని అంటున్నారు.

ఇదే షోలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటారని ఆయన తన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో సంద‌డి చేస్తాడ‌ని కూడా ప్ర‌చారం న‌డుస్తుంది.వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News