Telugu Flash News

Varahi : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఖరారు.. వారాహి ప్రత్యేకతలేంటి ?

pawan kalyan varahi

pawan kalyan varahi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan) వారాహి (varahi) యాత్ర ఖరారైంది. జూన్ రెండో వారంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్‌ పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పవన్ ప్రసంగించనున్నారు.

ఈ నెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తున్నట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అన్నవరం దర్శనానంతరం పత్తిపాడు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన కల్పించేందుకు యాత్ర కొనసాగుతుందన్నారు.

సమస్యలపై స్థానికుల నుంచి పవన్ ఫిర్యాదులు తీసుకుంటారని, సమస్యల పరిష్కారానికి స్థానికంగా పర్యటించనున్నట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని ప్రకటించారు. సినిమాల పరంగా ఇచ్చిన కమిట్మెంట్లు నెరవేరితేనే పవన్ ప్రజల్లో ఉంటాడని నాదెండ్ల మనోహర్ అన్నారు.

పవన్ సభలకు, రోడ్ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయని, అందుకే వారాహి వాహనం చుట్టూ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని జనసేన నేతలు తెలిపారు. అలాగే ఈ వాహనంలో వేలాది మందికి స్పష్టంగా వినిపించే అధునాతన సౌండ్ సిస్టమ్ ఉంటుంది.

అలాగే భద్రతా కారణాల దృష్ట్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి దాని ఫుటేజీని రియల్ టైమ్‌లో ప్రత్యేక సర్వర్‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఇక, వాహనంలోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే సౌకర్యం, వాహనం లోపల నుంచి పైకి వెళ్లేందుకు హైడ్రాలిక్ మెట్లు ఉన్నాయి.

ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాపాడే దేవత అని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

read more news :

Pawan Kalyan Varahi: ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వారాహి.. అసలు సంగ్రామం ఇప్పుడు మొదలవుతుందా?

Exit mobile version