Telugu Flash News

Pawan Kalyan Varahi: ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వారాహి.. అసలు సంగ్రామం ఇప్పుడు మొదలవుతుందా?

pawan kalyan varahi

pawan kalyan varahi

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు టీడీపీ యువ నేత నారా లోకేష్‌ (Nara lokesh) పాదయాత్ర, మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వారాహి (Pawan Kalyan Varahi) వాహనం ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం.. వెరసి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ టార్గెట్‌గా ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవశాలున్నాయని ఇప్పటికే కొందరు క్లారిటీకి వస్తున్నారు. అయితే, జనసేనాని ప్లాన్‌ ఎలా ఉందో తెలియక అధికార పార్టీ కాస్త ఆలోచనల్లో పండింది.

తాజాగా పవన్‌ తన ప్రచార వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ధర్మపురిలోనూ పూజలు చేసిన పవన్‌ కల్యాణ్‌..

pawan kalyan at kondagattu

తర్వాత ఏపీలోకి ఎంటర్‌ అయ్యారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు జనసేనాని. ఈ క్రమంలో తన ప్రచార వాహనానికి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అయితే, అసలు కథ ఇప్పుడే మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పవన్‌ వాహనం విషయంలో ఇప్పటికే రచ్చ జరిగింది. వారాహి రంగు విషయమై ఆర్మీ రంగును పోలి ఉందని వైసీపీ ఆరోపణలు గుప్పించింది. అయితే, ఆ కలర్‌ వేరు, ఇది వేరని, ఇది ఆర్మీ రంగు కాదని తెలంగాణ రవాణా శాఖ తేల్చి చెప్పింది. అనంతరం జాతీయ స్థాయి పర్మిషన్‌ ఇస్తూ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను కూడా కేటాయించింది. ఏపీలోకి రావడంపై వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది.

pawan kalyan varahi vehicle

మార్పులు చేయాల్సి ఉంటుందా?

పవన్‌ వాహనానికి అనుమతులిచ్చే విషయంపై రాష్ట్ర రవాణా శాఖ స్పందించాల్సి ఉంది. జీవో నంబర్‌ 1 ఎఫెక్ట్‌తో వారాహికి కాస్త ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఏపీ రవాణా శాఖ సూచించే కొన్ని మార్పులు కూడా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. వారాహి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే అందుకు వైసీపీ ఆంక్షలు విధిస్తుందా? అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. లోకేష్‌ పాదయాత్ర కంటే పవన్‌ యాత్రలపైనే ప్రభుత్వం ఫోకస్‌ పెంచే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.

also read news:

Sharwanand – Rakshitha reddy Engagement Photos

ODI Rankings : ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన శుభమన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌..

కేసీఆర్‌పై గవర్నర్‌ తమిళిసై సెటైర్లు.. అభివృద్ధి అంటే ఇది కాదంటూ..!

Exit mobile version