Telugu Flash News

Pawan Kalyan : జనసేనను బలోపేతం చేశాం.. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే

pawan kalyan

pawan kalyan

జనసేన పార్టీని (janasena Party) జాతీయ స్థాయిలో చర్చించేలా బలోపేతం చేశామని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అన్ని కులాలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపుల కోసం కేటాయించిన నిధులను వారి సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా, తమ అనుచరులకు పంచుకుంటున్నారని ఆయన అన్నారు.

జనసేన లక్ష్యం

రెండు భావజాలాల మధ్య ఉన్నవారిని ఒక్క తాటిపైకి తేవాలని ,  టీడీపీ, జనసేనల మధ్య ఉన్న భేదాలను పరిష్కరించి, ఒకే ప్రభుత్వం ఏర్పరచడం జనసేన లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ పాలనలో ఏపీలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీకి పరిశ్రమలు రావని ఆయన అన్నారు. 2024లో ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version