HomecinemaPawan Kalyan: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్ర‌హ్మ‌చారిగా ఉండాల‌నుకున్నాడా..!

Pawan Kalyan: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్ర‌హ్మ‌చారిగా ఉండాల‌నుకున్నాడా..!

Telugu Flash News

Pawan Kalyan: ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. రాజకీయాల‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప‌వ‌న్‌ని మూడు పెళ్లిళ్ల విష‌యంలో ఎక్కువ‌గా విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు.

అయితే, మూడు పెళ్లిళ్లు అనేది తన వ్యక్తిగతమని.. దానికి ప్రజాసేవకు లింకు పెట్టాల్సిన అవసరం లేదని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు.

అయితే తాజాగా అన్‌స్టాప‌బుల్ షోలో త‌న పెళ్లికి సంబంధించి క్షుణ్ణంగా వివ‌రించారు. ‘పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అని చాలా సింపుల్‌గా బాలయ్య అడిగేసినా.. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్లియ‌ర్‌గ‌ వివరణ ఇచ్చారు.

‘‘జీవితంలో అసలు పెళ్లే చేసుకోకూడదు అనుకున్నా. బ్రహ్మచారిగా ఉండిపోవాలి.. యోగామార్గంలోకి వెళ్లాలి అనుకున్నా. కానీ, నా జీవిత ప్రయాణం చూసుకుంటే నాకేనా ఇన్ని పెళ్లిళ్లు జ‌రిగాయి అని అనిపిస్తుంది.

ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా సంప్రదాయబద్ధమైనది, రిలేషన్‌షిప్‌లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోతారు. రెండోసారి పెళ్లిచేసుకున్నప్పుడు ఏకాభిప్రాయం రాకో.. వేరే ఏదో కారణంతో విడిపోయాం.

ప్రతీసారి మూడు పెళ్లిళ్లు అంటుంటే.. ముగ్గురినీ ఒకేసారి చేసుకోలేదురా బాబు, ముగ్గురితో ఒకేసారి ఉండట్లేదు, ఒక వ్యక్తితో కుదరలేదు ఇంకోసారి చేసుకోవాల్సి వచ్చింది.

-Advertisement-

ఆ వ్యక్తితో కుదరలేదు ఇంకోసారి చేసుకున్నాను. నేనేదో కోరుకొనో వ్యామోహంతో చేసుకోలేదు, జరిగాయంతే’’ అని పవన్ కళ్యాణ్ చాలా క్లియ‌ర్‌గా చెప్పుకొచ్చారు.

also read :

Gym : జిమ్‌కు వెళ్లే ముందు ఫుడ్‌ తీసుకోవాలా? నిపుణులు ఏమంటున్నారంటే!

horoscope today telugu : 04-02-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News