Telugu Flash News

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్ అంటే ఇది క‌దా.. 15 రోజులకు రూ. 50 కోట్ల పారితోషికం

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan: టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఓ వైపు రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సినిమాలు చేస్తున్న ప‌వ‌న్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్‌గా తమిళంలో హిట్ అయిన వినోదయ సితం సినిమా రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విష‌యం విదిత‌మే.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 15 రోజులకు 50 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న‌ట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకి 15 రోజులే డేట్స్ ఇచ్చారని తెలుస్తుండ‌గా, ఈ 15 రోజుల కోసం పవన్ కి రూ. 50 కోట్లు ఇస్తున్నారని వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అంటే ఈ లెక్కన రోజుకి 3.3 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు అన్న‌మాట‌. మ‌రి ప‌వ‌న్ రేంజ్‌కి ఈ మాత్రం ఇవ్వాల్సిందే అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి మొదట దేవర అనే టైటిల్ అనుకున్నా.. దేవుడు అనే టైటిల్ బాగుంటుందని పవన్ సూచించడంతో అదే ఫిక్స్ చేసినట్లు టాక్.

also read :

Kriti Sanon Hot Photo Gallery Collection, Images, Stills

Raashi Khanna Latest instagram photos, images, stills 2023

Exit mobile version