HomecinemaPawan Kalyan: నాగార్జున మూవీలోని పాట‌ని ప‌వ‌న్ త‌న సినిమాకి టైటిల్‌గా వాడ‌బోతున్నాడా..!

Pawan Kalyan: నాగార్జున మూవీలోని పాట‌ని ప‌వ‌న్ త‌న సినిమాకి టైటిల్‌గా వాడ‌బోతున్నాడా..!

Telugu Flash News

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నాడు. ఆయ‌న ప్రస్తుతం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ సితం ’ కి రీమేక్ గా తెరకెక్కిన సినిమాలో న‌టిస్తుండ‌గా, ఇందులో దేవుడిగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

చిత్రంలో ప‌వ‌న్ పాత్ర పేరు ‘టైం’ కాగా, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పాత్ర పేరు ‘మార్కండేయ’ అని తెలుస్తుంది. . జులై 28 వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ సినిమా టైటిల్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా రోజుల నుండి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన‌ట్టు టాక్. ఈ పేరు వింటే మ‌న‌కు అక్కినేని నాగార్జున నటించిన సంతోషం లోని దేవుడే దిగి వ‌చ్చిన అనే పాట గుర్తుకొస్తుంది కదూ?, సినిమా కథకి ఈ టైటిల్ తప్ప మరో టైటిల్ ఏది కూడా సరితూగడం లేదని, అందుకే ఈ టైటిల్‌కి ఫిక్స్ అయ్యార‌ని టాక్.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News