Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. ఈపేరు ప్రభంజనం. ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అయితే ఇటీవల మూడు పెళ్ళిళ్ళ విషయంతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్నారు.
పవన్ మొదటగా నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా, ఏవో విభేదాల వలన వారు విడిపోయారు. ఇక రెండో పెళ్లిగా బద్రి హీరోయిన్ రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం జన్మించాక విడాకులు తీసుకున్నారు. దీంతో మూడో పెళ్లిగా అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నాడు.
అయితే అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు ఎలా చిగురించి ఉంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.
2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్ మొదటిసారి కలుసుకున్నారు.
అయితే రష్యా భామ అయినటువంటి ఆమెతో పవన్ ఎలా ప్రేమలో పడ్డాడు అనేది చూస్తే.. పవన్ కళ్యాణ్ మాదిరిగానే అన్నా లెజినోవా కూడా ఎక్కువ దాన ధర్మాలు చేస్తుందట.
సాయం అడిగిన వారికి నో అని చెప్పే మనస్తత్వం తనది కాదని, అందుకే వీరి మనసులు కలిశాయని వారికి దగ్గరగా ఉండే సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.
also read :
Pawan Kalyan: ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్.. స్పెషల్ అట్రాక్షన్‌గా కుమారుడు మార్క్ శంకర్
Renu desai : రేణు దేశాయ్ ఒక్క మాట అని ఉంటే పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్లేవాడు..