HomecinemaPawan Kalyan: పవ‌న్ మాజీ భార్య నందిని ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా ?

Pawan Kalyan: పవ‌న్ మాజీ భార్య నందిని ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా ?

Telugu Flash News

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం ఈయ‌న స్టార్ హీరోల‌లో ఒక‌రు. ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాకే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు ఎక్కువయ్యాయి. అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు ప‌వ‌న్. ఆయ‌న ఇప్పుడు క‌మిట్ అయిన సినిమాల‌న్నింటిని కూడా ఏడాది లోపే పూర్తి చేయాల‌ని అనుకుంటున్నాడు.

ప్రస్తుతం పవన్‌ `హరి హర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `వినోదయ సీతం వంటి` చిత్రాల్లో నటిస్తున్నారు. జులై 28న `వినోదయ సీతం` రీమేక్‌ విడుదల కాబోతుండగా, ఈ మూవీ టైటిల్‌,ఫస్ట్ లుక్ కి కూడా టైం ఫిక్స్ చేశారు.. మరోవైపు `హరి హర వీరమల్లు` చాలా ఆలస్యం అవుతూ వ‌స్తుంది. హ‌రీష్ శంక‌ర్ సినిమా కూడా శ‌ర‌వేగంగా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఎక్కువ‌గా విమ‌ర్శించే వాళ్లు ఆయ‌న మూడు పెళ్లి టాపిక్ తీసి విమ‌ర్శిస్తుంటారు. హీరోగా రాణిస్తున్న కెరీర్‌ ప్రారంభంలోనే నందిని అనే అమ్మాయితో పెళ్లి జర‌గ‌గా, కొద్ది రోజుల‌కే విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత రేణూ దేశాయ్ ని చేసుకొని ఆమెకి విడాకులు ఇచ్చాడు. ప్ర‌స్తుతం అన్నా లెజీనోవాతో క‌లిసి ఉంటున్నాడు.

అయితే ప‌వ‌న్‌- నందినిల పెళ్లి 1997లో జరిగింది.దాదాపు పదేళ్లపాటు ఈ ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. కాని త‌ర్వాత వారి మధ్య చోటు చేసుకున్న మనస్పర్థాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సుమారు ఐదు కోట్ల వరకు ఆమెకి విడాకుల భరణంగా పవన్‌ ఇచ్చారని అప్ప‌ట్లో చాలా ప్ర‌చారం న‌డిచింది. అయితే ప‌వ‌న్ నుండి విడిపోయిన తర్వాత నందిని ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితమయ్యింది అని చెప్పాలి.

నందిని ఆస్తుల విలువ ?

నందిని .. డాక్టర్‌ కృష్ణరెడ్డిని ఆమె వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయిన‌ట్టు స‌మాచారం. అత‌నికి పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయట. అయితే పవన్‌ తో విడాకుల తర్వాత ఆమె తన పేరు కూడా మార్చుకుందట. నందిని నుండి జాన్వీగా పేరు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరు అమెరికాలో ఉంటుందన్నారని, చాలా రాయల్‌ లైఫ్‌ అనుభవిస్తున్నట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. నందిని భర్త అక్కడ రిచ్‌ పర్సన్‌ అని, వారి ఆస్తుల విలువ సుమారు మూడు వందల కోట్ల వరకు ఉంటాయని టాక్.

తన గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటుంద‌ట నందిని. ఆమె పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌ని లీడ్‌ చేయడానికే ఇష్టపడుతున్న నేప‌థ్యంలో సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటుందని తెలుస్తుంది. ఇక పవన్‌ నందినికి విడాకుల అనంతరం రేణు దేశాయ్‌ని ప్రేమించి అకిరా నందన్‌ పుట్టిన తర్వాత ఆమెని పెళ్లి చేసుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. 2009లో వీరి పెళ్లి జరగ్గా ఆ తర్వాత ఆద్య జన్మించింది. 2012లో రేణు దేశాయ్‌కి కూడా పవన్‌ విడాకులిచ్చాడు.

-Advertisement-

also read :

Shyamala : నా చేతి వంట తిని నన్ను వెన్నుపోటు పొడిచింది.. శ్యామ‌ల షాకింగ్ కామెంట్స్

Niharika : ఎవ‌డో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నాకెందుకు.. నిహారిక ఫైర్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News