Telugu Flash News

Pawan Kalyan : కొద్ది రోజుల పాటు రాజకీయాల‌కి బ్రేక్.. పూర్తిగా సినిమాల‌తోనే బిజీ..!

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారడంతో.. ఇటీవ‌ల‌ ఏపీ టూర్ లో బిజీగా బిజీగా ఉన్నారు ప‌వ‌న్ . మ‌రో వైపు సినిమాల విషయంలో కూడా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచకుండా.. షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. అటు రాజ‌కీయాల‌ని ఇటు సినిమాలను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న ప‌వ‌న్ ఇప్పుడు కొన్నాళ్ల పాటు రాజ‌కీయాల‌కి బ్రేక్ ఇవ్వ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

pawan kalyan

ఏప్రిల్ అంతా షూటింగ్స్ కు కేటాయించాలి అని నిర్ణయించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ను ఒప్పుకున్న సినిమాల‌న్నీ పూర్తి చేసి ఆ త‌ర్వాత పూర్తి రాజ‌కీయాల‌కే టైం కేటాయించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ దశలో ఉండ‌గా, తమిళ రీమేక్ సినిమా వినోదయ సీతయం సినిమా కూడా స్పీడ్‌గా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక వీటితో పాటు సుజీత్ చిత్రం, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల‌ని కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Exit mobile version