HomecinemaPavitra- Naresh: ప‌విత్ర లోకేష్- నరేష్‌ కిస్ వెన‌క సీక్రెట్ పెళ్లి కాదు.. మ‌రొక‌టి ఉంది..!

Pavitra- Naresh: ప‌విత్ర లోకేష్- నరేష్‌ కిస్ వెన‌క సీక్రెట్ పెళ్లి కాదు.. మ‌రొక‌టి ఉంది..!

Telugu Flash News

Pavitra- Naresh:  పవిత్ర లోకేష్.. ఇప్పుడు ఈ పేరు తెలుగు ప్రేక్షకుల నోళ్ల‌లో తెగ నానుతూ వ‌స్తుంది. ఈ మధ్య కాలంలో పవిత్ర సినిమాల కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలు, వివాదాలతోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సీనియర్ నటుడు నరేష్‌తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కృష్ణ అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో వీరిద్ద‌రు చేసిన ర‌చ్చ‌పై జ‌నాలు తిట్టిపోసారు. అస‌లు ఈ ఇద్ద‌రి మ‌ధ్య సంబంధం ఏంటి అని అంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో ఇటీవలే సీనియర్ నటుడు అధికారిక ప్రకటన చేశారు. త్వరలోనే పవిత్ర లోకేష్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఆమెతో కలిసి ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో పవిత్ర, నరేష్ లిప్ లాక్ కూడా ఉంది. కొత్త సంవత్సరంలో, కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం.. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ .. చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాని షేక్ చేసింది.

ఈ ట్వీట్ తర్వాత త్వ‌ర‌లో వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని, ప‌విత్రని పెళ్లి చేసుకునేందుకు న‌రేష్ మూడో భార్యకు భ‌ర‌ణం కూడా పెద్ద మొత్తంలో చెల్లించాడ‌నే టాక్ వ‌చ్చింది. కాని ఇదంతా కూడా ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం సమాచారం. సోషల్ మీడియాలో పలువురు ఈ విషయం డిస్కస్ చేస్తున్నారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నరేష్-పవిత్ర బయోపిక్ అని కూడా కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.

నరేష్, పవిత్ర వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాల్ని ఈ మూవీలో చూపించబోతున్నట్లు కూడా టాక్ న‌డుస్తుంది.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు ఓ టాక్ వినిపిస్తోంది. సినిమా తీయడం ద్వారా అసలు ఏం జరిగిందో? ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో? అందరికీ ఓ క్లారిటీ ఇవ్వాలని ఇద్దరూ భావించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన చివరి సినిమా ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’. ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రం అంతంత మాత్రంగానే ఆడింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News