HomenewsPakistan : పాకిస్తాన్‌లో దయనీయ పరిస్థితులు.. చుక్కలనంటిన ద్రవ్యోల్బణం

Pakistan : పాకిస్తాన్‌లో దయనీయ పరిస్థితులు.. చుక్కలనంటిన ద్రవ్యోల్బణం

Telugu Flash News

Pakistan : పాకిస్తాన్‌లో సంక్షోభం అంతకంతకూ పెరిగిపోతోంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు వెరసి.. సామాన్య ప్రజలు బతకడమే కష్టతరంగా మారిపోతోంది. తాజాగా ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా పాకిస్తాన్‌ నిలిచింది.

ఈ మేరకు ఏప్రిల్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఈ రికార్డు శ్రీలంక పేరుతో ఉండేది. గత సంవత్సరం ఏప్రిల్‌తో పోల్చితే పాకిస్తాన్‌లో రిటైల్‌ ధరలు 36.4 శాతం పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి.

1964 ఏడాది తర్వాత ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి అని స్పష్టమవుతోంది. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్‌ సర్వే కీలక వివరాలు వెల్లడించింది. ఏప్రిల్‌లో శ్రీలంక ద్రవ్యోల్బణం 35.3 శాతానికి తగ్గడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కోలుకుంటుందనే ఇండికేషన్లు వచ్చాయి.

అయితే, పాకిస్తాన్ కరెన్సీ పతనం కూడా శ్రీలంక మాదిరిగా కష్టాలను తలపిస్తోంది. సంక్షోభాన్ని మరింత ఎగదోసేలా కనిపిస్తోంది. ఈ ఏడాదిలో పాకిస్తాన్‌ రూపాయి డాలర్‌తో పోలిస్తే 20 శాతం పడిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కంటే అత్యంత బలహీనమైన కరెన్సీల్లో ఒకటిగా పాకిస్తాన్‌ కరెన్సీ నిలిచింది. గత నెలలో పాకిస్తాన్‌ రూపాయి జీవిత కాల కనిష్టానికి చేరుకుంది. ట్రాన్స్‌పోర్టు ధరలు 56.8 శాతం ఆకాశాన్నంటాయి.

మరోవైపు ఆహార ద్రవ్యోల్బణం కూడా గతేడాది ఏప్రిల్‌తో పోల్చి చూస్తే 48.1 శాతం పెరిగిపోయింది. బట్టలు, చెప్పుల ధరలు కూడా 21 శాతంపైనే పైకి వెళ్లాయి. హౌసింగ్‌, వాటర్‌, పవర్‌కు సంబంధించిన ధరలు కూడా సుమారు 17 శాతం పెరిగాయి. ఐఎంఎఫ్‌ నుంచి 6.5 బిలియన్‌ డాలర్ల రుణాన్ని పునరుద్ధరించడానికి పాకిస్తాన్‌ నానా కష్టాలు పడుతోంది.

-Advertisement-

ఐఎంఎఫ్‌ మెచ్చుకోవాలంటే దేశీయంగా పూర్తిస్థాయిలో పన్నులు పెంచాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ధరలను కంట్రోల్‌ చేసేందుకు పాకిస్తాన్‌ గత నెలలో వడ్డీ రేట్లను 21 శాతానికి చేర్చింది. 1956 తర్వాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లు పెరగడం ఇదే తొలిసారి అని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని, కార్మిక నేతలు ఇటీవల మేడే సందర్భంగా ఆక్రందన చెందారు. నగరాల్లో ర్యాలీలు చేసేందుకు కూడా అధికారులు అనుమతి ఇవ్వలేదు. మెరుగైన హక్కుల కోసం పెషావర్‌లో కార్మిక సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. లాహోర్‌, కరాచీల్లో సెమినార్లు, ర్యాలీలు కొనసాగిస్తున్నారు.

also read :

PM Modi : జై బజరంగ్‌ బలి.. కర్ణాటకలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించిన ప్రధాని మోదీ..

Pushpa2: ఇది క‌దా బ‌న్నీ క్రేజ్.. రికార్డ్ ధ‌ర‌కి పుష్ప‌2 ఆడియో రైట్స్..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News