Telugu Flash News

తల్లిదండ్రులు తమ పిల్లల ముందు మాట్లాడకూడని 5 విషయాలు

పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి లేదా చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా నేర్చుకుంటారు దూషించడం, అరవడం మరియు ఒకరినొకరు నిందించుకోవడం మొదలైనవి వారి ముందు చేయడం వారి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల ముందు మాట్లాడే విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి.

తల్లిదండ్రులు ఒకరినొకరు బాధపెట్టుకునే మాటలు వింటే పిల్లలకు వారి మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడచ్చు. అలాగే, పిల్లలు తమ తల్లిదండ్రులతో ఇంకా మిగతావారితో కూడా అదే విధంగా ప్రవర్తించచ్చు, ఇది తప్పు అనే సంగతి వారికి తెలియకపోవచ్చు.

మీ పిల్లల ముందు మాట్లాడకూడని విషయాలు:

1. దూషించే మాటలు

ఇంట్లో ఎప్పుడూ దుర్భాషలాడకుండా, ముఖ్యంగా పిల్లలు ఇంట్లో ఉండే సమయంలో. 6 నుండి 16 సంవత్సరాల వయస్సు పిల్లలు అటువంటి భాషను త్వరగా నేర్చుకుంటారు. అలా మాట్లాడచ్చు అని వారు అనుకుంటారు, ప్రత్యేకించి తల్లిదండ్రులు అలా మాట్లాడడాన్ని వింటే తాము కూడా అలా మాట్లాడినా పర్లేదు అనే భావన వారికి వస్తుంది.

2. ‘నోరు ముయ్యి’

చాలా మంది తల్లిద్రండులు పిల్లలు తమతో మాట్లాడుతుంటే వారి మాటల ప్రవాహం ఆపలేక చెప్పే మాట ఇది. కానీ ఈ మాట వారి చిన్ని మనసులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రతి విషయం మీతో పంచుకోవాలనే వారి ఉత్సాహం తగ్గిపోతుంది, వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రలు, పిల్లల మధ్య అంతరం పెరుగుతుంది.

3. మరొకరితో పిల్లల గురించి పంచుకోవడం

‘పిల్లలు పుట్టకముందు జీవితం చాలా బాగుండేది’ పిల్లలు పుట్టకముందే జీవితం చాలా తేలికగా ఉండేదని మనలో చాలా మంది స్నేహితులకు చెప్పే మాట కానీ అది చాలా పొరపాటు. మీరు అలాంటి మాటలు చెప్పడం మీ పిల్లలు వింటే, వారికి ఆత్మనూన్యత భావం ఏర్పడచ్చు.

4. సమయాన్ని కేటాయించలేకపోవడం

“నేను కొంచెం బిజీగా ఉన్నాను కన్పించడం లేదా?”. మీరు చాలా బిజీగా ఉండవచ్చు పిల్లలతో గడపడానికి సమయం ఉండదు. కానీ మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని వారికి ఇంకొంచెం అర్ధం అయ్యేలా చెప్పచ్చు . పిల్లలందరు తల్లిదండ్రులు ఎప్పుడు తమతోనే ఉండాలని భావిస్తారు అటువంటప్పుడు తాము చేస్తున్న పని ఎంత ముఖ్యమైనదో వివరించి అర్ధం అయ్యేలా చెప్పాలి.

5. ‘ఆ బాబు/పాప చూడండి ఎంత బుద్దిగా ఉన్నారో? లేదా ఎంత చక్కగా చదువుతున్నారో?”

మీ పిల్లలను వేరేవారితో పోల్చడం వల్ల వారు మీకు నచ్చినట్టుగా మారతారు అని మీరు అనుకోవచ్చు కానీ అలాంటి విధానం వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయచ్చు. వారి ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది.

also read: 

అందానికి బాదాం ఫేస్ ప్యాక్ బెస్ట్

అందరూ తెలుసుకోవాల్సిన ధర్మాలు.. మీరూ తెలుసుకోండి!

 

Exit mobile version