HomesportsAsad Rauf Dead: క్రికెట్‌లో విషాదం.. పాపుల‌ర్ అంపైర్ అసద్ రవూఫ్ హ‌ఠాన్మ‌ర‌ణం

Asad Rauf Dead: క్రికెట్‌లో విషాదం.. పాపుల‌ర్ అంపైర్ అసద్ రవూఫ్ హ‌ఠాన్మ‌ర‌ణం

Telugu Flash News

Asad Rauf Dead: క్రికెట్‌లో అతి పెద్ద విషాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ మాజీ అంపైర్ అస‌ద్ రవూఫ్ గురువారం (సెప్టెంబర్ 15) గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఆయన వయసు 66 ఏళ్లు కాగా, అసద్ రవూఫ్ తుదిశ్వాస విడిచినట్టు ఆయన సోదరుడు తాహిర్ రవూఫ్ తెలిపారు.

అసద్ రవూఫ్ మరణంతో పాకిస్తాన్ క్రికెట్‌లో తీవ్ర‌ విషాదం నెలకొంది. పాక్ క్రికెటర్లు మాత్రమే కాకుండా దేశాలకి చెందిన ప‌లువురు ఆటగాళ్లు రవూఫ్ మరణం పట్ల సంతాపం తెలియ‌జేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. పాకిస్తాన్‌ నుంచి అలీమ్‌ దార్‌ తర్వాత విజయవంతమైన అంపైర్‌గా అసద్‌ రవూఫ్ పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

తీవ్ర విషాదం..

అసద్ రవూఫ్ లాహోర్‌లోని లాండా బజార్‌లో ఓ బట్టల దుకాణం నిర్వహిస్తుండ‌గా, ఆ దుకాణాన్ని కట్టేసి..ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో.. అసద్ రౌఫ్ ఛాతీలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో వెంటనే రవూఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అతను కోలుకోలేకపోయాడు అని సోదరుడు స్ప‌ష్టం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అసద్ రవూఫ్ తుదిశ్వాస విడిచారు.

పంజాబ్‌లో జన్మించిన 66ఏళ్ళ అసద్ రౌఫ్ అంతర్జాతీయ క్రికెట్ లో 150కి పైగా మ్యాచ్ లకు అంపైర్‌గా వ్య‌వ‌హ‌రించారు. 2006లో రవూఫ్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్‌లలో చేరగా,. 2013లో తొలగించబడ్డారు. రవూఫ్ 7 ఏళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో 170కి పైగా మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. వాటిలో 64 టెస్టులు,139 వన్డేలు, 28 టీ20లు ఉన్నాయి.

అసద్‌ రవూఫ్ అంపైర్‌గా మాత్రమే కాకుండా పాకిస్థాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా కూడా మంచి రికార్డులు న‌మోదు చేశాడు. 71 ఫస్ట్ క్లాస్ మరియు 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు 26 అర్ధ సెంచరీల సహాయంతో 3423 మరియు 611 పరుగులు అస‌ద్ ర‌వూఫ్‌ చేశారు.

2013 ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అసద్ రౌఫ్ మెడకు చుట్టుకోగా, ఆయ‌న బుకీల నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించి, ఫిక్సింగ్ కి పాల్ప‌డ్డాడ‌ని ఆరోప‌ణ‌లు రాగా, సుదీర్ఘ విచారణ తర్వాత దోషిగా తేలడంతో 2016లో బీసీసీఐ అతడిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసినప్పటికీ అంపైర్ గా రీఎంట్రీ ఇచ్చేందుకు అసద్ రౌఫ్ ఇష్టపడలేదు. .

-Advertisement-

మరిన్ని వార్తలు చదవండి :

Robin Uthappa announces retirement : రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప

Pushpa: పుష్ప‌ సామీ సామీ పాట‌కు చిన్నారి డ్యాన్స్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన సూర్య‌

sreemukhi in pink suit images 2022

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News