Homeinternationalpakistan news : భారత్ తో తాము చేసిన తప్పును తెలుసుకున్నామని పాక్ ప్రధాని

pakistan news : భారత్ తో తాము చేసిన తప్పును తెలుసుకున్నామని పాక్ ప్రధాని

Telugu Flash News

భారత్ తో తాము చేసిన తప్పును తెలుసుకున్నామని పాకిస్థాన్ (pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ భారత్ తో జరిగిన మూడు యుద్ధాలతో గుణపాఠం నేర్చుకున్నామని,ఇక నుంచి భారత్ తో సోదరభావంతో మెలగాలని కోరుకుంటున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దుబాయ్‌కి చెందిన ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తమ తప్పును తాము తెలుసుకున్నామని వ్యాఖ్యానించారు.

వివరాల్లోకి వెళ్తే ఏడాది కాలంగా పాక్ ఆర్ధిక సంక్షోభంతో నానాతిప్పలు పడుతుందన్న విషయం అందరికి తెలిసిందే.దీని నుంచి గట్టెకాలని ప్రయత్నిస్తున్న పాక్ పొరుగు దేశాల నుంచి సహాయం కోరుతుండగా.. దుబాయ్‌కి చెందిన ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహబాజ్‌ షరీఫ్ భారత్‌తో సంబంధాల గురించి పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత గుణపాఠం నేర్చుకున్నామని,తాము శాంతిని కోరుకుంటున్నామని అన్నారు.

కశ్మీర్‌తో సహా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో సీరియస్‌గా నిజాయితీతో చర్చించాలని పిలుపునిచ్చారు.అయితే కాశ్మీర్‌లో ఏమి జరుగుతుందో దానిని ఆపాలని అన్నారు.భారతదేశం చాలా సోదర దేశమని,వాళ్ళు ఎల్లప్పుడూ సోదర సంబంధాలను పంచుకుంటారని తెలిపారు.

భారతదేశంతో మూడు యుద్ధాలు చేయడం వల్ల మరింత కష్టాలు, నిరుద్యోగం, పేదరికం లాంటి తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చిందే తప్ప వాటి వల్ల వారికి లాభం ఏమీ కలగ లేదని అన్నారు.ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలిగితే భారత్‌తో శాంతియుతంగా జీవించవచ్చని,తాము ఇదే కోరుకుంటున్నారని షెహబాజ్‌ షరీఫ్ చెప్పారు.

కూర్చుని మాట్లాడుకుందాం

“శాంతియుతంగా జీవించడం, పురోగతి సాధించడమా లేదా ఒకరితో ఒకరు గొడవపడి సమయం, వనరులను వృధా చేసుకోవడమా అనేది మన ఇష్టం. మేము పేదరికాన్ని నిర్మూలించాలని, అభివృద్దిని సాధించాలని, మా ప్రజలకు విద్య, ఆరోగ్య సౌకర్యాలు, ఉపాధిని అందించాలని కోరుకుంటున్నాం.  బాంబులు, మందుగుండు సామాగ్రి కోసం మన వనరులను వృథా చేయకూడదని… అదే నేను ప్రధాని మోదీకి ఇవ్వాలనుకుంటున్నానని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

రెండు దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలని యూఏఈ అధ్యక్షుడిని కోరుకుంటున్నట్లు కూడా తెలిపారు. “భారత ప్రధాని నరేంద్ర మోదీకి నా సందేశం ఏమిటంటే… కూర్చుని మాట్లాడుకుందాం మరియు మన సమస్యలన్నింటినీ టేబుల్‌పైకి తీసుకువద్దాం. కశ్మీర్ సహా అనేక సమస్యలకు పరిష్కారం వెతుకుదాం’’ అని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

-Advertisement-

పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుందని,అయితే కాశ్మీర్‌లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు.రెండు దేశాలలో ఇంజనీర్లు, వైద్యులు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని,తాము ఈ ఆస్తులను శ్రేయస్సు కోసం ఉపయోగించాలను కుంటున్నామని రెండు దేశాలు అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావాలను కుంటున్నామని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా ఉగ్రవాద హింస నీడలో పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరగవని భారత్‌ ఇంతకు ముందే స్పష్టం చేయగా.. ప్రధాని మోదీ షెహబాజ్‌ షరీఫ్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించాల్సి ఉంది.

also read:

Bengaluru News : రోడ్డుపై 71 ఏళ్ల పెద్ధాయన్ని ఈడ్చుకెళ్లిన యువకుడు.. వైరల్ వీడియో

క్యారెట్‌, బీట్‌రూట్‌, టమాటా కాంబో జ్యూస్‌.. పరగడుపున తాగితే లాభాలివే!

Rishabh Pant: రిష‌బ్ అభిమానులకి షాకింగ్ న్యూస్.. వ‌చ్చే ఏడాది కూడా పంత్ ఆడ‌డం డౌటే…!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News