HomeinternationalPakistan Crisis : పాకిస్థాన్ ఆర్ధిక తిప్పలను అధిగమిస్తుందా? లేక శ్రీలంకలా దివాళా దిశగా పయనిస్తుందా?

Pakistan Crisis : పాకిస్థాన్ ఆర్ధిక తిప్పలను అధిగమిస్తుందా? లేక శ్రీలంకలా దివాళా దిశగా పయనిస్తుందా?

Telugu Flash News

Pakistan Crisis : పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ దిగజారుతోంది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏనాడూ మెరుగ్గా లేనప్పటికీ గత ఏడాది వారి అప్పుల బాధలు ఆకాశాన్ని అంటింది.2020లో డాలర్ ధర పాకిస్థాన్ రూపాయితో పోల్చితే దాదాపుగా 30 శాతం పడిపోయింది.దీనికి తోడు గత ఏడాది వచ్చిన వరదలతో పాకిస్థాన్ పరిస్థితి మరింత దీనంగా తయారైంది.

గత ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వరదలు ముంచెత్తడంతో దేశంలో మూడో వంతు మునిగి పోయింది.దీని వల్ల దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ వరదల కారణంగా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినడంతో పాక్‌ నుంచి ఎగుమతులు భారీగా పడిపోయాయి.

పరిస్థితి అధ్వానం

ఎక్కువ శాతం నిత్యావసరాల దిగుమతిపై ఆధార పడే పాక్ పరిస్థితి దీంతో మరింత అధ్వానంగా తయారైంది. వాణిజ్య లోటు పెరగడంతో విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. ఆర్థిక కష్టాల నుంచి కొంచెం ఊరట పొందడానికి అమెరికాలోని ఎంబసీ ఆస్తులను పాక్‌ అమ్మేస్తుండగా..కరెంటు పొదుపు చేయడం కోసం చీకటి పడగానే సగం వీధి దీపాలను ఆపేస్తున్న పాక్ మార్కెట్లను, మాల్స్‌ కూడా చీకటి పడేముందే మూసేస్తుంది.ఇలాంటి ప్రయత్నాల వల్లయినా 273 మిలియన్‌ డాలర్ల విలువైన ఇందన దిగుమతులు తగ్గుతాయని పాక్ ఆశిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 23 శాతానికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రోజు రోజుకి నిత్యావసరాల కొరత మరింత దారుణంగా తయారవుతుంది.పాకిస్థాన్ లో గోధుమ పిండి,చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతుండగా..ప్రజలు వాడే వంట నూనెలో 90 శాతం దిగుమతి నూనె కావడంతో నెల రోజుల్లో ఒక లీటర్ నూనె ధర 26 రూపాయలు పెరిగింది.

అప్పుల కోసం నానాకష్టాలు

రంజాన్ నెల సమీపిస్తున్న ఈ సమయంలో నిత్యావసరాలలో కొరత,రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు ప్రజలకు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇలా ఎటు చూసినా ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న పాక్ అప్పు తప్ప ఇంకో మార్గం లేదని భావిస్తుంది.కొంత అప్పు తీసుకుని కొంచెం ఊరట పొందుదామని పాక్ ఆశిస్తుండగా… అప్పుల కోసం ఎక్కడికి వెళ్ళినా వారికి చుక్కెదురవుతుంది.

అప్పుల కోసం నానాకష్టాలు పడుతున్న పాక్ అప్పు పుడుతుందని ఆశించిన ప్రతి చోటా తమ అదృష్టం పరీక్షించుకుంటుంది. 3 బిలియన్‌ డాలర్ల అప్పు కావాలని సౌదీ అరేబియాను అడుగుతోంది. మరో పక్క ఐఎంఎఫ్‌తో బెయిలవుట్‌ ప్రోగ్రామ్‌ కింద నిధుల కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నది.

-Advertisement-

శ్రీలంకలా దివాళా దిశగా ?

ఇప్పటికే పాక్ అప్పుల్లో చైనా ఇచ్చినవే 30 శాతం వరకు ఉండగా ఇంకొంత అప్పు కోసం చైనా దగ్గర చెయ్యి చాస్తుంది. ఇలా అప్పులు తెచ్చిన ప్రతి చోటా వడ్డీలు కడుతూ,కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తున్న పాక్ పరిస్థితి ఇంకొంత కాలంలో మెరుగు అవ్వకపోతే శ్రీలంక దారిలో దివాళా దిశగా పాక్ పయనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

also read:

Chiranjeevi: క‌మెడీయ‌న్ డైలాగ్ వాల్తేరు వీర‌య్య కోసం చిరు కాపీ కొట్టారా..!

HAWA MAHAL : గాలిలో కట్టిన కోటలా ఉండే ‘హవామహల్’ గురించి మీకోసం..

Surendran K Patel : సాధారణ బీడీ కార్మికుడి నుంచి టెక్సాస్ లో జడ్జి స్థాయికి…

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News