IND vs ZIM: క్రికెట్ గేమ్ ఇప్పుడు ఎలా మారిందంటే ఎంటర్టైనింగ్గా కాకుండా చాలా ప్రస్టేజియస్‌గా ఉంది.ఒకప్పుడు క్రికెట్‌ని ఎవరు పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని ఇప్పుడు అలా కాదుక్రికెట్లో తమ ఫేవరేట్ టీమ్ ఓడిపోతే ఆ ఆవేశంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్‌లో గ్రూప్ బీ పోరు రసవత్తరంగా ఉంది. సెమీస్‌లో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇండియా ఏది అడుగుపెడుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై పాక్ గెలవడంతో వారి సెమీస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్..
లెక్క ప్రకారం ఇంకా సెమీస్ రేసులోనే ఉన్న పాకిస్తాన్.. సెమీఫైనల్ చేరడం, చేరకపోవడం ఆ రెండు అంశాలపై ఆధారపడి ఉంది. భారత జట్టు జింబాబ్వేపై ఓడిపోవడం, ఆ ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై కూడా పాక్ గెలిస్తే ఈ జట్టు సెమీస్ చేరే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయి.
అయితే సెమీస్ బెర్తు మాత్రం కన్ఫర్మ్ అవదు. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్ ఆరు పాయింట్లతో ఉంది. పాకిస్తాన్ వద్ద నాలుగు పాయింట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్‌పై గెలిస్తే ఈ రెండు జట్ల పాయింట్లు సమానం అవుతాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా పాక్ సెమీస్ చేరే అవకాశం ఉంది.
అందుకే పాక్ అభిమానులు.. జింబాబ్వేపై భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. తమపై జింబాబ్వే జట్టు అద్భుతంగా ఆడి ఎలా ఓడించిందో.. భారత్‌ను కూడా అలాగే ఓడించాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు చెందిన నటి సెహర్ షిన్వారీ కూడా భారత్ ఓడిపోవాలని కోరుకుంది.
‘జింబాబ్వే జట్టు కనుక తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే.. నేను ఆ దేశపు వ్యక్తినే పెళ్లి చేసుకుంటా’ అని షాకింగ్ ట్వీట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటి చీప్ ట్రిక్స్ మీరు మానరా అంటూ ఫైర్ అవుతున్నారు. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు కూడా ఇలాంటి ట్వీటే చేసిన ఆమె.. ‘ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోతే నా ట్విట్టర్ ఖాతా డిలీట్ చేసేస్తాను.
I'll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match 🙂
— Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022
మళ్లీ ట్విట్టర్ ముఖం కూడా చూడను అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు అదే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే తన పేరు మార్చుకొని ‘నరేంద్ర మోదీ’ అని పెట్టుకుంటానని కూడా అంది. కాని ఏది చేయకపోవడంతో తెగ ట్రోల్ చేస్తున్నారు.
also read :
bigg boss telugu 6 : బిగ్ బాస్ పెద్ద చిచ్చు పెట్టాడుగా.. ఇక ఫైటింగ్ పీక్స్‌లోనే..!
horoscope today : 4-11-2022 శుక్రవారం రాశి ఫలాలు మీ కోసం..