Kohli: రన్ మెషీన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటతో పాటు ఆటిట్యూడ్‌తో కోహ్లీ ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కోహ్లీ రూటే సపరేట్. తొలుత బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్‌కు దిగినా భారీ ఇన్నింగ్స్ ఆడడం ఆయన స్పెషాలిటి. ఇక హాఫ్ సెంచరీలు, సెంచరీలను చాలా సులువుగా చేస్తుంటాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (100) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ కోహ్లీ అనే విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం 71 సెంచరీలు చేశాడు కోహ్లీ.
అభిమాని వినతి..
తాజాగా ఇంగ్లండ్ తో స్వదేశంలో పాక్ ఆడుతున్న టీ20 సిరీస్‌లోఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గడ్డాఫీ స్టేడియంలో ఇంగ్లండ్, పాకిస్థాన్ ఆరో టీ20లో తలపడగా, ఓ అభిమాని “కోహ్లీ.. నీవు రిటైర్ అయ్యేలోపు పాకిస్థాన్‌లో ఒక్కసారైనా ఆడాలి.. అంటూ ప్లక్కార్డ్ ప్రదర్శించాడు. దీంతో అందరి కళ్లు అన్నీ అటే పడ్డాయి. అంతే కాదు చాలా మంది అభిమానులు కూడా ఇలానే తమ దేశంలో క్రికెట్ ఆడాలంటూ కోరుతున్నారు.
సరిహద్దు వివాదాల కారణంగా దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచులు జరగడం లేదనే విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నమెంట్ చులలో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ లాంటి టోర్నీలలో ఈ రెండు తలపడుతుండగా, అభిమానులకి పైసా వసూల్ అన్నట్టు ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. సోషల్ మీడియాలోను కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ట్విట్టర్‌లో 50.4 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన విరాట్ కోహ్లీకి ఫేస్‌బుక్‌లో కూడా 50 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయన బాగానే సంపాదిస్తున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకి 1,088,000 అమెరికన్ డాలర్లు ఆర్జిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అక్షరాల 8 కోట్ల 90 లక్షల రూపాయలకు పైగా కోహ్లీ సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్నాడు.. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న టాప్ 20 సెలబ్రిటీల్లో కోహ్లీ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే..