Telugu Flash News

Surya kumar yadav : టీమిండియా క్రికెటర్ పై పాకిస్తాన్ బ్యాటర్ ప్రశంసలు.. అతనంటే చాలా ఇష్టమట..

Mohammad Rizwan hails Suryakumar Yadav, opens up on their battle for No 1 T20I ranking

Mohammad Rizwan hails Suryakumar Yadav, opens up on their battle for No 1 T20I ranking

Surya kumar yadav :న్యూజిలాండ్ వేదికగా శుక్రవారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఐసీసీ టీ20 సిరీస్ రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ట్రై సిరీస్‏లో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‏లో భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటి నెలకొంది.

ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచేందుకు ఇరు దేశాలకు చెందిన మహ్మద్ రిజ్వాన్ (mohammad rizwan), సూర్యకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో అత్యంత ప్రదర్శ చేసి నంబర్ వన్ బ్యాట్‏మెన్ రేసులో నిలిచాడు సూర్యకుమార్.

ఇక ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ తర్వాత సూర్యకుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. పాక్ ఓపెనర్ రిజ్వాన్ , సూర్యకుమార్ మధ్య చాలా తక్కువ పాయింట్ల తేడా ఉంది. ఈ క్రమంలోనే టీ20 ర్యాకింగ్ పై పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ పెదవి విప్పాడు. తనతో స్వల్ప పాయింట్ల తేడాతో రెండవ స్థానంలో ఉన్న సూర్య కుమార్ పై ప్రశంసలు కురిపించాడు.

రిజ్వాన్ మాట్లాడుతూ.. టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ మంచి ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతని ఆట తీరు అంటే నాకు చాలా ఇష్టం. కానీ అతను ఇన్నింగ్స్ ప్రారంభించడానికి.. మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. సూర్య గురించి.. అతని ఆట గురించి చర్చను వేరే కోణంలో చూడాలి.

నేను టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తుంటే సూర్యకుమార్ మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు. అంతే కాకుండా టీ20లో నంబర్-1 బ్యాట్స్‌మెన్‌గా నిలవాలని నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇది పాకిస్థాన్ జట్టు అవసరాలను తీరుస్తుంది. నెం.1, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనసులో ప్రతికూల భావనతో ఆడతారు. కాబట్టి ఈ విషయంలో నేనెప్పుడూ పెద్దగా ఆలోచించలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

భారత్.. పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఒత్తిడి ఎక్కువ..

భారత్ -పాకిస్థాన్ మ్యాచ్‌లు అంటే ఎప్పుడూ అధిక ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ని చూస్తోంది. కాబట్టి ఇలాంటి మ్యాచ్‌లో ప్రశాంతంగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఏడాది మంచి క్రికెట్‌ ఆడాం. కాబట్టి భారత్ పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో మేం అంత ఒత్తిడిలో లేము. అయితే ఇది ప్రపంచకప్‌ మ్యాచ్‌ కావడంతో మాకు ఇది చాలా కీలకం అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version