విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఖ్యాతి అంచెలంచెలుగా ఎదిగిన విషయం తెలిసిందే. నటుడిగాను, రాజకీయ నాయకుడిగాను ఆయన ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ ఏకచత్రాధిపత్యం నడుస్తున్న రోజులలో ఆయన మాట ఎదురించి ధిక్కరించిన వారు ఇండస్ట్రీలో ఎవరు లేరు అంటే అతిశయోక్తి కాదు.
అందరికీ అన్నగారంటే ప్రత్యేకమైన గౌరవం ఉండేది.మూడు షిఫ్ట్ లలో పనిచేస్తూ ఆయన చాలా బిజీగా ఉండేవారు. అయితే ఎన్టీఆర్ ని ఎదిరించి ఇండస్ట్రీలో నిలిచిన ఏకైక వ్యక్తి కమెడియన్ పద్మనాభం మాత్రమే. తొలినాళ్లలో ఎన్టీఆర్, పద్మనాభం ఒకే గదిలో అద్దెకు ఉన్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ కన్నా కూడా పద్మనాభం మొదటి నుండి ఆర్ధికంగా బాగానే ఉన్నారు.
ఆ కారణంతోనే తన మొదటి ప్రొడక్షన్ లో అన్నగారితో సినిమా తీయాలని పద్మనాభం అనుకున్నాడు.కానీ ఏవో కొన్ని కారణాలవల్ల అవి కార్యరూపం అయితే దాల్చలేదు. పద్మనాభం తన పేరు పైన సొంత స్టూడియో ని కూడా కట్టించుకున్నారు అంటే ఆయన ఎంతటి స్థితిమంతుడు అనేది అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఏవో కారణాల వలన అన్నగారు పద్మనాభం తో ఉన్న రూమ్ ను ఖాళీ చేసి టీ నగర్ లో సొంతిల్లు తీసుకొని అక్కడ సెటిల్ అయ్యారు. అప్పుడు రాజబాబుతో కలిసి పద్మనాభం కొన్నాళ్లపాటు అద్దె రూమ్ లో ఉన్నారు. అయితే తను తీసిన కమెడియన్ రోల్స్ తోనే హీరోయిజం పండించడంతో పద్మనాభంకి వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
అయితే ఎందుకో కాని పద్మనాభం నిర్మాణంలో అన్నగారు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే అన్నగారికి కుదరకపోవడం వల్లనే అలా జరిగింది తప్ప కావాలని చేసింది కాదు. అయితే పద్మనాభం తన సినిమాలో ఎన్టీఆర్ నటించడానికి ఒప్పుకోలేదు అనే విధంగా ప్రచారం చేయడం సాగించాడట.దాంతో ఎన్టీఆర్ కి కోపం వచ్చి పద్మనాభంని చాలా దూరం పెట్టాడట.
ఆ తర్వాత ఎవరి దారులు వారివి అన్నట్టు సాగాయి. అయితే ఇప్పుడు ఆలీ కమెడీయన్‌గా, హీరోగా ఎలా అలరించాడో అప్పట్లో పద్మనాభం కూడా ప్రధాన పాత్రలో నటిస్తూ తన కామెడీతో దూసుకుపోయాడు. ఎన్టీఆర్‌ని ఎదిరించి టాలీవుడ్‌లో పద్మనాభం గట్టిగానే నిలబడ్డాడు.
also read news: