Oversleeping : ఖాళీగా ఉన్నాం కదా.. అని చాలా మంది కాస్త ఎక్కువగా నిద్రపోతుంటారు. వారాంతాల్లో ఓవర్ స్లీపింగ్ మానుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వారాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయేవారిలో గుండె పనితీరు దెబ్బతింటుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం.
- మనిషి జీవితంలో నిద్ర ఒక భాగం…సహజ నిద్ర మెదడును చురుకుదనం చేస్తుంది.
2. శారీరకంగా, మానసికంగా ఉత్తేజపరిచేందుకు నిద్ర దోహదం చేస్తుంది.
3. ఈ నిద్రకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఎక్కువగా నిద్రపోయినా సమస్యలు తప్పవు. తక్కువగా నిద్రపోయినా సమస్యలు తప్పవు.
4. 7 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారిలో 50 శాతం కుంగుబాటు లక్షణాలు కనిపిస్తాయట.
5. ఉదయం లేచాక తలనొప్పి, వెన్నునొప్పి, మగత వంటి ఇబ్బందులేవీ లేకుంటే కంటి నిండా నిద్రపోయినట్టే.
6. అతి తక్కువగా నిద్రపోతే 82 శాతం స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ ఉంటుందట.
7. రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్ ముప్పు 23 శాతం ఎక్కువని తేలింది.
also read :
Mrunal thakur: మృణాల్ ఠాకూర్ ని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..