Telugu Flash News

AP Govt: రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం.. ప్రతిపక్షాలకు ఏపీ ప్రభుత్వం కౌంటర్!

AP Govt: ఆంధ్రప్రదేశ్‌లో అప్పులపై మరోసారి రచ్చ కొనసాగుతోంది. అప్పులపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మద్దతుదారులు, మేధావుల ముసుగు ధరించి తప్పుడు విశ్లేషణలు చేస్తూ రాష్ట్రాన్ని, ప్రజలను భయపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్‌) దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి అనుగుణంగానే ప్రభుత్వ రంగ సంస్థలకు పూచీకత్తు ఇవ్వొచ్చని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థల అప్పులపై ఎప్పటికప్పుడు వివరాలు అందజేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొందరు నిపుణుల ముసుగేసుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని దువ్వూరి మండిపడ్డారు. జీవీ రావు అనే వ్యక్తి ఎవరికీ పెద్దగా పరిచయం లేదన్నారు. గంటా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తే.. సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు జీవీ రావును రెండు సంవత్సరాలు సస్పెండ్ చేసిన వార్త తప్పించి పెద్దగా ఏ సమాచారమూ దొరకలేదని కృష్ణ తెలిపారు. ఇలాంటి వార్తలు తప్ప.. జీవీ రావు అనే వ్యక్తి బడ్జెట్ తయారీలో కీలకంగా వ్యవహరించారని, బడ్జెట్ కోసం పని చేశారనిగానీ ఎక్కడా కనిపించలేదన్నారు.

ప్రభుత్వంతో కలిసి పని చేసిన పరిస్థితులు లేవని, పబ్లిక్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్స్ తో కూడా కలిసి పని చేసినట్లుగా కనిపించలేదన్నారు. ఎవరికీ పరిచయం లేని వ్యక్తి జీవీ రావు అని, ఆయన కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. అది కూడా విశ్లేషణ, గణాంకాలు లేకుండా కేవలం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మాట్లాడటం భావ్యమా అని ప్రశ్నించారు. రాష్ట్రం సర్వనాశనమైపోతుందని చెప్పడం.. అలాంటి వారి వ్యాఖ్యలను ఓ దినపత్రిక ప్రచురించడం తీవ్ర అభ్యంతరకరమని దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారికి నిపుణులు, విశ్లేషకులని ట్యాగ్‌ తగిలించి వారు చెప్పేది పత్రికల్లో ప్రచురించడం సరైన పద్ధతి కాదని దువ్వూరి కృష్ణ హితవు పలికారు. రాష్ట్రం గురించి, ఏపీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యాఖ్యలు ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 21.87 సీఏఆర్‌జీ చొప్పున పెరిగిన అప్పులు.. ప్రస్తుతం 12.69 సీఏజీఆర్‌ చొప్పున మాత్రమే పెరిగాయని వివరించారు.

Read Also : Pawan Kalyan: వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోం.. పొత్తులపై పవన్‌ క్లారిటీ!

Exit mobile version