AP Elections 2024 | హిందూపురం పై ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. ఈసారి విజయంతో ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం నియోజకవర్గం రాజకీయం మొత్తం గెలిచినా ఓడినా ఏ పార్టీకైనా కొన్ని ఓట్లు రావడం సహజం..
కానీ హిందూపురం టౌన్ లోని ఓ పోలింగ్ బూతు లో మాత్రం వైసీపీ కి ఒక్కటంటే ఒక్క ఓటు పడింది.. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది పోనీ ఈ పరిధిలో వైసపి కార్యకర్తలు గాని సానుభూతిపరులు గాని అసలు లేరా అంటే అదేం కాదు వాళ్ళు ఉన్నారు..ఈసారి బాలకృష్ణకు 107250 ఓట్లు రాగా… వైసీపీ అభ్యర్థి దీపికకు 74653 ఓట్లు పడ్డాయి… అంటే 32597 ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య..
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 36 వ వార్డు లోని 28 వ నెంబర్ పోలింగ్ స్టేషన్ లో… వైసపీ కి కేవలం ఒక్కటంటే ఒక్క ఓటే పడింది… ప్రస్తుతం ఈ వార్డ్ కౌన్సిలర్ గా టీడిపి నాయకురాలు భారతీ ఉన్నారు.. అంతకుముందు వైసపి కి చెందిన నాగభూషణ్ రెడ్డి ఇక్కడి నుంచే కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు..
ఈ 28 వ నెంబర్ పోలింగ్ స్టేషన్ ముదిరేటిపల్లి పరిధిలోకి వస్తుంది… ఇక్కడ చేనేత సామాజిక వర్గం వారు ఎక్కువ కాగా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు… ఈ పోలింగ్ స్టేషన్ లో మొత్తం 578 ఓట్లు పోలయ్యాయి.. అందులో 570 వాలిడ్ కాగా ఎనిమిది ఓట్లు నోటాకి పడ్డాయి.. 570 ఓట్లలో టిడిపి వైసీపీ లను కాదని కాంగ్రెస్ అభ్యర్థి ఇనయతుల్లాకు అత్యధికంగా 464 ఓట్లు వచ్చాయి… టీడిపి అభ్యర్థి బాలకృష్ణకు 95 ఓట్లు పడ్డాయి.
ఇక వైసీపీ అభ్యర్థి దీపికకు మాత్రం ఒకే ఒక్క ఓటు రావడంపై ఆ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.. అంటే ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో వైసపి కార్యకర్తలు సైతం కాంగ్రెస్ టిడిపి కే ఓట్లు వేశారన్న ప్రచారం సాగుతోంది.. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఇనయతుల్లాకు 464 ఓట్లు రావై కూడా వైసిపీలో చర్చనీయా అంశంగా మారింది… ఏదేమైనా గతంలో ఈ వార్డుని కైవసం చేసుకున్న పార్టీకి ఇప్పుడు ఒక్క ఓటు రావడం మాత్రం షాకింగ్ గా ఉంది.