HomenationalBRS Aurangabad : మహారాష్ట్రలో మరోసారి బీఆర్ఎస్ బహిరంగ సభ.. కేసీఆర్ టార్గెట్‌ అదేనా?

BRS Aurangabad : మహారాష్ట్రలో మరోసారి బీఆర్ఎస్ బహిరంగ సభ.. కేసీఆర్ టార్గెట్‌ అదేనా?

Telugu Flash News

BRS Aurangabad Sabha : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్రపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే పర్యాయాలు ఆ రాష్ట్రంలో బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్.. తాజాగా మరోసారి అక్కడ భారీ సభకు సిద్ధమయ్యారు.

తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశ రాజకీయాల్లో తనదైన మార్క్‌ వేయాలని ఉవ్విళ్లూరుతున్న సీఎం కేసీఆర్.. మొదట మహారాష్ట్రను టార్గెట్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు అన్ని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.

సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇప్పటికే మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌లో సభ, తర్వాత అదే జిల్లాలో మరో సభ నిర్వహించారు సీఎం కేసీఆర్. ఆయా సభలకు జనం నుంచి మంచి స్పందన కనిపించింది.

ఈ నేపథ్యంలోనే మరోసారి సభ నిర్వహించి జనం దృష్టిని ఆకర్షించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇవాళ ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్‌ మూడో బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేసీఆర్‌ పాల్గొనే ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.

మహారాష్ట్రలో రెండు సభల్లోనూ జనం భారీగా రావడంతో కేసీఆర్‌ తన కార్యాచరణను తెలియజేశారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదం ఎత్తుకున్న కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తున్నారు.

బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనని.. ఈ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని కేసీఆర్ పలు సందర్భాల్లో చెబుతున్నారు. దేశంలో వినియోగంలో లేని వనరులు చాలా ఉన్నాయంటున్నారు.

-Advertisement-

చైనా దేశానికి పోటీగా అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను అగ్రగామిగా నిలుపుతామని స్పష్టం చేస్తున్నారు సీఎం కేసీఆర్.

మరోవైపు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పేరున్న నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు.

మహారాష్ట్రకు చెందిన నేతలు నిత్యం ప్రగతిభవన్‌కు వచ్చి కలుస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఔరంగాబాద్‌ నుంచి కూడా కీలక నేతలు కేసీఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. తమ ప్రాంతంలో సభ నిర్వహించాలని కోరగా.. కేసీఆర్ సమ్మతించారట.

ఈ సభను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్కడే మకాం వేశారు. తెలంగాణ నుంచి వెళ్లిన నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

also read :

Ajinkya Rahane : టెస్టులకు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నాడు!

Nagarjuna | అఖిల్.. వాళ్ల అమ్మ‌ని చాలా ఇబ్బంది పెట్టాడు : నాగార్జున‌

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News