Homebigg boss telugu season 6Bigg Boss6: బిగ్ బాస్ షోలో పాత కంటెస్టెంట్స్ ర‌చ్చ‌.. ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఫ‌న్

Bigg Boss6: బిగ్ బాస్ షోలో పాత కంటెస్టెంట్స్ ర‌చ్చ‌.. ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఫ‌న్

Telugu Flash News

Bigg Boss6:  బిగ్ బాస్ సీజ‌న్ 6కి నేటితో పులిస్టాప్ ప‌డ‌నుంది. మ‌రి కొద్ది గంట‌ల‌లో విన్న‌ర్ ఎవరో తేలిపోనుంది. అయితే నేడు జ‌గ‌ర‌నున్న‌ ఫినాలేలో విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, రోహిత్ టాప్ 5 గా ఉండగా, ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరో తేల్చ‌నున్నారు. అయితే ఫినాలేకి ముందు శనివారం రోజు హౌస్ మేట్స్ హౌస్ లో ఎంతో సంతోషంగా గడిపారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి ప్రవేశించి ఎంటర్టైన్ చేశారు.

ముందుగా హౌస్ లోకి రోల్ రైడా ఎంటర్ అయ్యాడు. హుషారైన ర్యాప్ తో అదరగొట్టిన త‌ర్వాత రేవంత్ తో పాటలు పాడి ఎంటర్టైన్ చేశారు.వారితో చిందులు కూడా వేశాడు రోల్ రైడా. అనంతరం సోషల్ మీడియా గ్లామర్ బాంబ్ అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. రాను రానంటూనే చిన్నదో అనే సాంగ్ తో అషురెడ్డికి స్వాగతం పలికారు. అషురెడ్డితో పాటు మెహబూబ్ కూడా వచ్చాడు. వీరిద్దరూ హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించడం, డ్యాన్స్ చేయడం చేసారు. అషురెడ్డి, మెహబూబ్ ‘సిలకలూరి సింతామణి ‘ ఐటెం సాంగ్ కి డ్యాన్స్ చేసి హుషారెత్తించ‌గా, అషూ బ్లూ మినీ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది.

ఇక అషూ హౌజ్‌మేట్స్‌కి ఓ టాస్క్ ఇచ్చింది. త‌నని ఇంప్రెస్ చేయాల‌నే టాస్క్ పెట్టాగా, ఇందులో రోహిత్ .. తన భార్య మెరీనాకి సారీ చెబుతూ ఆమెని ఇంప్రెస్ చేసేశాడు. అనంతరం అరియనా, అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. అరియనా బ్లాక్ డ్రెస్ లో హాట్ లుక్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, త‌న అల్ల‌రితో పాటు అందంతో కూడా క‌ట్టిప‌డేసింది.ఇక అవినాష్ తన ఫన్నీ చేష్టలతో నవ్వించాడు. అరియనా, అవినాష్ ఇద్దరూ రచ్చ చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచారు. అలాగే ఆర్జే కాజల్, భానుశ్రీ, రవికృష్ణ కూడా బాగ్ బాస్ హౌస్ లోకి మరోసారి ఎంట్రీ ఇస్తూ కాసేపు హౌజ్‌మేట్స్‌తో స‌ర‌దాగా గ‌డిపారు. టాప్ 5 కంటెస్టెంట్స్ స‌ర‌దాస‌రాదాగా గ‌డ‌ప‌గా, అనంత‌రం ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మొత్తానికి శ‌నివారం ఎపిసోడ్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి కాగా, ఈ రోజు ఎవ‌రు గెలుస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News