HomecinemaOke Oka Jeevitham : సూప‌ర్ హిట్ చిత్రం ఒకే ఒక జీవితం అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తుందా?

Oke Oka Jeevitham : సూప‌ర్ హిట్ చిత్రం ఒకే ఒక జీవితం అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తుందా?

Telugu Flash News

Oke Oka Jeevitham: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ కొన్నాళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో చాలా ఇబ్బందులు ప‌డ్డాడు. ఆరు ఫ్లాపుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఒకే ఒక జీవితంతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా శ్రీ కార్తీక్ చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడు.

ఇక ఈ చిత్రంలో అమ‌ల కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా, రీతూ వ‌ర్మ క‌థానాయిక‌గా క‌నిపించి సంద‌డి చేసింది. సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా తొలి షో నుండే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. దీంతో మూవీకి మంచి వ‌సూళ్లే వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

ఓటీటీ టైం ఫిక్స్..

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లీవ్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుండ‌గా, ఇందుకోసం సుమారు 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. వచ్చేనెల అంటే అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.

అతి త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు జ‌నాలు చాలా ఆస‌క్తి చూపుతున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించ‌గా, . జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు.

‘ఒకే ఒక జీవితం’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది.

దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.29 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.29 కోట్లు లాభాలు కూడా రావ‌డంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీగా ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News