Rohit Sharma: ప్రస్తుతం ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రెండో టీ20 జరగగా, ఇందులో రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ సునాయాస విజయం సాధించింది.
రెండో టి20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పై ఘనవిజయం సాధించి సిరీస్‌ని సమం చేసింది. చిత్తడి ఔట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ను 8 ఓవర్ల చొప్పున కుదించిన విషయం తెలిసిందే.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 90 పరుగులు చేసింది.మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) ఆసీస్ భారీ స్కోర్ సాధించింది.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టగా, హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి మరోసారి నిరాశపరిచాడు.
సూపర్ మ్యాచ్..
ఇక 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 91 పరుగులు చేసి సిరీస్ సమం చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో, ఇన్నింగ్స్ చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి..అప్పుడే క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (2 బంతుల్లో 10 నాటౌట్; 1 సిక్స్, ఒక ఫోర్) వరుసగా 6, 4 కొట్టి మ్యాచ్ లో భారత్ గెలిచేలా చేశాడు.
ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్స్ భారీగానే పరుగులు ఇచ్చారు.. మొత్తానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ సేన విజయ దుందుభి మోగించింది.
ఇక విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం కాగా, సిరీస్ డిసైడ్ ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు టిక్కెట్ల కోసం క్రికెట్ ప్రేమికులు నానా తంటాలు పడుతున్నారు.