odisha train accident : గత నెలలో జూన్ 2 న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి గల కారణాలను విచారణ కమిటీ వెల్లడించింది. ఈ ఘోర రైలు ప్రమాదానికి తప్పుడు సిగ్నలింగ్ కారణమని నిర్ధారించారు.
దీంతో పాటు పలు స్థాయిల్లో లోపాలున్నాయని గుర్తించిన రైల్వే సేఫ్టీ కమిషన్ తన విచారణ నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది.
సరియైన భద్రతా ప్రమాణాలు ముందే పాటించి ఉంటే ఇంతటి ఘోర ప్రమాదం జరిగేది కాదు అని విచారణ కమిటీ అభిప్రాయపడింది.
గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగినట్లు చెబుతున్నారు. లోపాన్ని సరిదిద్ది ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని నివేదికలో పేర్కొన్నారు.
జూన్ 2వ తేదీ రాత్రి ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ సహా మూడు రైళ్లు ఊహించని రీతిలో ఢీకొన్న సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో 290 మంది మరణించగా, 1100 మంది గాయపడ్డారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనపై రైల్వే బోర్డు సూచనతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగిస్తోంది.
అయితే తొలుత రైల్వే సేఫ్టీ కమిషన్ విచారణ చేపట్టగా, కమిటీ విచారణ ముగించి రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించింది.
read more :
Ganja Smuggling : గంజాయి రవాణా చేస్తున్న మహిళల అరెస్టు🚔
Weather report : భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!