HomesportsODI Rankings : ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన శుభమన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌..

ODI Rankings : ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన శుభమన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌..

Telugu Flash News

టీమిండియా యువ క్రికెటర్‌ శుభమన్‌ గిల్‌.. తాజాగా తన పర్ఫార్మెన్స్‌తో అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌ (ODI Rankings) లో ఏకంగా కింగ్‌ కోహ్లీ, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మలను వెనక్కి నెట్టి కొత్త చరిత్ర సృష్టించాడు గిల్‌. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా శుభమన్‌ గిల్‌ మూడు మ్యాచ్‌లలోనే రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. దీంతో అతడికి కెరీర్‌లోనే మెరుగైన ర్యాంక్‌ దక్కింది.

కివీస్‌తో హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శుభమన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీతో (209) అలరించాడు. తర్వాత రెండో మ్యాచ్‌లోనూ 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడో మ్యాచ్‌లోనూ 112 పరుగులతో తనదైన మార్క్‌ ఆటతీరు కొనసాగించాడు.

Shubman Gill 6th place in ODI Rankings
Shubman Gill double century

అంతకు ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ గిల్‌.. అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 70, 21, 116 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 20 స్థానాలు ఎగబాకి టాప్‌ 6లోకి ప్రవేశించాడు శుభమన్‌ గిల్‌.

ర్యాకింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం తొలి స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 7వ స్థానంలోనూ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 9వ స్థానంలో ఉన్నారు. డస్సెన్ రెండు, డికాక్‌ మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ నాలుగు, పాక్‌ ప్లేయర్‌ ఇమాముల్‌ హక్‌ ఐదో ప్లేస్‌ దక్కించుకున్నారు.

సిరాజ్‌ నయా చరిత్ర

Mohammed Siraj no 1 place in ODI Rankings
Mohammed Siraj

ఇక బౌలింగ్‌ కేటగిరీలో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో తొలిసారి నంబర్‌ వన్ బౌలర్‌గా అవతరించాడు. కివీస్‌తో, అంతకు ముందు శ్రీలంకతోనూ అద్భుత ప్రదర్శన చేశాడు సిరాజ్‌. అయితే, వన్డేల్లో సిరాజ్‌ ఒక్కడే భారత్‌ తరఫున టాప్‌ 10లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హేజిల్‌ వుడ్‌ సెకండ్‌ ప్లేస్‌లోనూ, కివీస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ మూడో స్థానం దక్కించుకున్నారు. మిచెల్‌ స్టార్క్‌ నాలుగు, అఫ్గానిస్తాన్‌ స్పిన్‌ దిగ్గజం రషీద్‌ ఖాన్‌ ఐదో ప్లేస్‌లో ఉన్నారు.

also read news:

-Advertisement-

కేసీఆర్‌పై గవర్నర్‌ తమిళిసై సెటైర్లు.. అభివృద్ధి అంటే ఇది కాదంటూ..!

Padma Awards 2023 : కీర‌వాణికి ద‌క్కిన ప‌ద్మ అవార్డ్‌.. సింగర్ వాణి జయరామ్‌కి పద్మభూషణ్ అవార్డు

pineapple benefits : పైనాపిల్‌ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే అస్సలు వదలరు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News