Telugu Flash News

october 16 horoscope : ఆదివారం 16-10-2022 మీ రాశి ఫ‌లాలు..

horoscope today news

october 16 horoscope :

మేషరాశి (mesha rashi):
ఈ రోజు బంధుమిత్రుల‌తో స‌ర‌దాగా ఉంటారు. శ్ర‌మకు తగిన ఫలితం లభిస్తుంది. రుణ భారం త‌గ్గుతుంది. సమాజంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెర‌గ‌డంతో పాటు శుభ‌కార్యాల‌కు సంబంధించిన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయి.

వృషభ రాశి(vrishaba rashi):
ఈరోజు కళాకారులకు.. మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు వ‌స్తాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను క‌ల‌వ‌డం, పేరు, ప్రతిష్టలు సంపాదించడం జ‌రుగుతుంది.నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

మిథునరాశి (mithuna rashi):
ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులను క‌లుగుతాయి.. అవకాశాలను చేజార్చుకోవ‌డం జ‌రుగుతుంది. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండ‌డం మంచింది. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి (karkataka rashi) :
ఈ రాశి వారు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు ఎక్కువ‌గా ఉంటాయా. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహించ‌డమే కాక‌ ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు.

సింహరాశి (simha rashi) :
ఈరోజు రుణప్రయత్నాలు ఆలస్యంగా క‌లుగుతాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడాల్సిని అవ‌స‌రం ఉంది. . నూతన వ్యక్తులను నమ్మి మోసపోకుండా ఉండండి.

క‌న్యా రాశి (kanya rashi) :
ఈ రాశి వారు వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. బంధు మిత్రుల‌తో క‌ల‌హాలు ఏర్ప‌డే అవ‌కాశంకూడా ఉంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది.

తుల రాశి (tula rashi):
ఈ రాశి వారిక బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉన్నా, రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది.

వృశ్చిక రాశి (vrushchika rashi):
ఈ రాశి వారు నేడు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం వ‌స్తుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ఇతరులకు ఉపకారం చేయడానికి ఏమాత్రం వెన‌కాడ‌రు. శత్రు బాధ‌లు క‌లుగుతాయి.

ధనుస్సు రాశి (dhanusu rashi):
ఈ రాశి వారికి ప‌లు ఆటంకాలు ఎదురవుతాయి. అందరితో స్నేహంగా ఉండడానికి ప్ర‌య‌త్నిస్తారు. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచింది.

మకర రాశి (makara rashi) :
ఈ రాశి వారికి అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. . మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉండ‌డం వ‌ల‌న అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.

కుంభరాశి (kumba rashi) :
ఈరోజు బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేయ‌డంలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల‌కు సంతోషాన్నిక‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తారు.

మీన రాశి (meena rashi) :
ఈ రాశి వారిక నేడు సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోవ‌డం వ‌ల‌న ఆవేద‌న చెందుతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా ప‌డతాయి.

Exit mobile version