NTR: మే 28న సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కావడంతో తెలుగు రాష్ట్రాలలో శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న ఎన్టీఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు శ్రద్దాంజలి ఘటించారు. అయితే ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించడానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే బాలకృష్ణ, వారి ఫ్యామిలీ ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించి తారక రాముడికి ఘన నివాళులు అర్పించి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తాత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు.
Perfect Right Track lo unnav @tarak9999 Anna 👌👌👌🔥🔥🔥. pic.twitter.com/wMG8LbPSIP
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) May 28, 2023
కోపాన్ని పంటికింద అదుముకుని సమాధి వద్ద నమస్కరిస్తూ తాత సీనియర్ ఎన్టీఆర్‌కి నివాళ్లు అర్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక అక్కడికి వచ్చిన అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ, సీఎం సీఎం అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది అనే చెప్పాలి.
The Future @tarak9999 👑
NTR at NTR Ghat today ❤️#Devara #ManOfMassesNTR #100YearsofLegendaryNTR pic.twitter.com/a4XNTv9JZv— BallariNTRFans (@Ballari_Nfans) May 28, 2023
read more news :
NTR : నందమూరి అభిమానుల్లో కుంపటి పెట్టిన టీడీపీ నేత.. ఎన్టీఆర్‌కి చురకలు