Telugu Flash News

NTR:వెకేష‌న్‌కి వెళ్లిన‌ ఎన్టీఆర్.. పిల్ల‌లు భ‌లే ముద్దొస్తున్నారుగా..!

ntr vacation

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. ఆయ‌న ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం దేవ‌ర అనే మూవీ చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ కూడా విడుద‌ల కాగా, ఇది అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేసింది. స‌రికొత్త గెట‌ప్‌లో జూనియ‌ర్ లుక్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. తన కెరీర్ లోనే దేవర బెస్ట్ మూవీ అవుతుందని ఇప్పటికే కొరటాల చెప్ప‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. సముద్ర తీర ప్రాంతంలో ప్రజలని పీడించే రాక్షసుల అంతం చూసే దేవరగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో న‌టిస్తుండ‌గా, ఆయ‌న‌పాత్రకి ఇప్పటికే ఫియర్ ఆఫ్ గాడ్ అని ఎలివేషన్స్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో కూడా న‌టించ‌నున్నాడు. ఇక రానున్న రోజుల‌లో టైట్ షెడ్యూల్ ఉన్నందున ఫ్యామిలీతో క‌లిసి విహార యాత్ర‌కు వెళ్లాడు. దేవర షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఆదివారం రోజు తాతగారి శతజయంతి వేడుకలు పూర్తి చేసుకున్న తారక్.. సాయంత్రం ఫ్యామిలీతో వెకేషన్ కి వెళుతూ శంషాబాద్ విమానాశ్రయంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. . తారక్ , లక్ష్మి ప్రణతి దంపతులు.. వారితో పాటు పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ కూడా క‌నిపించ‌గా, ఈ ఇద్ద‌రు పిల్ల‌లు క్యూట్ క్యూట్‌గా ఉన్నారు. చిన్న కొడుకు భార్గవ్ రామ్ అయితే తండ్రి చేయి పట్టుకుని విమానాశ్రయంలో బుడిబుడి అడుగులు వేస్తుండా, అక్క‌డి వారు క్యూట్ ఫ్యామిల‌లీని త‌మ కెమెరాలలో బంధించారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మ‌రాయి

ఇక ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం నందమూరి తారకరామారావు శత జయంతి వేడుక‌లు హైదరాబాద్ లోజ‌ర‌గ‌గా, ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాక‌పోవ‌డంతో ఆ విష‌యం అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై రీసెంట్‌గా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జనార్ధ‌న్ స్పందించారు. తారక్ ఎందుకు హాజరుకాలేదు అనే అంశంపై ఒక ఇంటర్వ్యూలోమాట్లాడిన ఆయ‌న‌ ముందుగా అపాయింట్ మెంట్ అడిగితే వారం రోజుల తర్వాత కలిసే అవకాశం ఇచ్చారని, విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో వేడుకలకు రాలేకపోతున్నానని చెప్పార‌ని అన్నాడు. అయితే ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నైనా చేసుకోవచ్చని, కానీ శతజయంతి వేడుకలు మాత్రం ఒకసారే వస్తాయని, వస్తే బాగుంటుంద‌ని తాము చెప్పామ‌ని జ‌నార్ధ‌న్ పేర్కొన్నారు.

read more news :

NTR:త‌న తాత‌కి అస‌హ‌నంతో నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. కార‌ణం ఏంటో తెలుసా?

Exit mobile version