Telugu Flash News

NTR: ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ నా కాళ్లు ప‌ట్టుకున్నాడు అని చెప్పిన సీనియ‌ర్ న‌టి

NTR: సీనియ‌ర్ న‌టి, ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుధ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన సుధ త‌మిళ న‌టి అయిన తెలుగులో చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. ఎక్కువ‌గా తెలుగు సినిమాలు చేసిన సుధ ఇక్క‌డే సెటిల్ అయిపోయి అచ్చు తెలుగు వారిలా మారిపోయింది.ఈమె ఎక్కువగా అమ్మ, అత్త పాత్రలతో ప్రేక్షకులని మెప్పించింది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కి సైత తల్లి, అత్త పాత్రల్లో నటించి మెప్పించింది. దాదాపు 500 కి పైగా సినిమాల్లో నటించిన సుధ ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాలు చేస్తుండ‌గా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

బాద్‌షా సినిమాలో ఎన్టీఆర్, సుధ కలిసి నటించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ కి తల్లి పాత్రలో నటించ‌గా, ఓ సన్నివేశంలో పాత పాటలకి ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ వేసే సన్నివేశం ఉంటుంది. దీంట్లో ఎన్టీఆర్ తో కలిసి సుధ అదరగొట్టేసారు అయితే తాజా ఇంటర్వ్యూలో సుధ ఈ సీన్ సమయంలో జరిగిన ఓ సంఘటనని షేర్ చేసుకుంది. సుధ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేసే సీన్ లో ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. అయినా ఎందుకో ఇంకో సారి చేస్తే బెటర్ ఏమో అని ఇంకో టేక్ తీసుకుందాం అని చెప్పాను . బాగానే వచ్చింది ఇంకోటి ఎందుకు అని ఎన్టీఆర్ అన్నారు. అయినా నా కోసం ఓకే అన్నారు. సెకండ్ టైం చేసేటప్పుడు నా కాలు బెణికింది.

అక్కడే పడిపోబోతుంటే ఎన్టీఆర్ పట్టుకొని కుర్చోపెట్టాడు. నా కాలు పట్టుకొని బెణికిన చోట పెయిన్ రిలీఫ్ స్ప్రే తెప్పించి స్ప్రే చేశాడు. నా కాలికి మర్దన చేశాడు. ఒక స్టార్ హీరో అయి ఉండి అలా చేశాడు. ఎన్టీఆర్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చుసుకోండమ్మా జాగ్రత్తగా అని వేరే వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతారు వాళ్ల‌కి ఏమి సంబంధం లేనట్టు. కానీ ఎన్టీఆర్ అలా తనే కాళ్ళు పట్టుకొని మ‌ర్ధ‌న‌ చేశాడు. అంత మంచివాడు. సాధారణంగా స్టార్ హీరోలని ఇండస్ట్రీలో చాలా మ‌ర్యాద‌గా పిలుస్తారు. వారు, మీరు అని అంటుంటారు. కాని నేను మాత్రం ఎన్టీఆర్ ని వాడువీడు అనే అంటాను. అత‌న్ని నా కొడుకులా ఫీల్ అవుతాను. ఆ విష‌యంలో ఎన్టీఆర్ కూడా ఏమి అనడు అని సుధ తెలిపింది.

Exit mobile version