Telugu Flash News

NTR : ఒకే వేదిక‌పై తార‌క్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ తో పాటు మ‌రి కొంత మంది తార‌లు..

NTR event in kukatpally

NTR : టాలీవుడ్ స్టార్స్ కొంద‌రిని ఒకే వేదిక‌పై చూస్తే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఒకే వేదిక‌పై తార‌క్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ,ప్ర‌భాస్‌ల‌ని చూడ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. గత నెలలో స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు అట్ట‌హాసంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై అనేక విష‌యాలు షేర్ చేసుకున్నారు. అయితూ ఇవి ఇప్పుడు టిడిపి పార్టీ ఈవెంట్ లాగా జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ అన్నీ తానై ముందుకు నడిపిస్తున్న క్ర‌మంలో మ‌రి కొద్ది రోజుల‌లో హైదరాబాద్ కూకట్ పల్లి లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నార‌నే టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ కార్య‌క్ర‌మానికి తెలుగు దేశం పార్టీ నాయకులతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా హాజరు కానున్నార‌ని స‌మాచారం. కొద్ది రోజుల క్రితం తెలుగు దేశం పార్టీ ప్రతినిధులు ఈ సభకి జూ. ఎన్టీఆర్ ని ఆహ్వానించ‌డం మ‌నం చూసాం. అలాగే టాలీవుడ్ నుంచి ఇతర స్టార్ హీరోలని కూడా ఆహ్వానించినట్లు టాక్ వినిపిస్తుంది.. ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ లని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారని ఫిలిం ఇండ‌స్ట్రీలో ప్రచారం న‌డుస్తుంది. ఇదే క‌నుక నిజ‌మైతే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఒకే వేదికపై కనిపించి ప్రేక్ష‌కుల‌కి మంచి అనుభూతిని అందించ‌నున్నార‌ని అంటున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌ , కన్నడ నుంచి శివరాజ్ కుమార్ లు కూడా రాబోతున్న‌ట్టు తెలుస్తుంది.

తమ అభిమాన హీరోలంతా ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకి క‌నుల పండుగ‌గా ఉంటుంది. కాగా, హైదరాబాదులో మే 20వ తేదీన శకపురుషుడు సావనీర్, జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కేపీహెచ్ బీ కైతలాపూర్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ల నివాసాలకు వెళ్లి ఆహ్వాన పత్రికలు కూడా అందించారు.

అలాగే దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి జయకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంఠంనేని ఉమాశ్రీనివాస్ ప్రసాద్, ఎన్టీఆర్ బావమరిది కాట్రగడ్డ రుక్మాంగదరావు తదితరులను కలిసి ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందించారు.. ఇక‌ ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్, వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మే 20వ తేదీ జ‌ర‌ప‌నుండ‌గా, ఈ ఈవెంట్‌ సాయంత్రం 5 గంట‌ల‌కు మొద‌లు కానుంది.

also read :

Mrunal thakur photos at cannes 19-05-2023

Anil Ravipudi: బాల‌య్య పాట‌ల‌కు అదిరిపోయేలా డ్యాన్స్ చేసిన అనీల్ రావిపూడి.. వీడియో వైర‌ల్‌

Exit mobile version