NGT : జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal) బిహార్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. ఘన, ద్రవ రూప వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు గానూ 4 వేల రూపాయలు కట్టాలని గట్టి షాక్ ఇచ్చింది. ఈ మేరకు జరిమానా విధించింది ఎన్జీటీ. ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను రెండు నెలల వ్యవధిలోపు జమ చేయాలని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యర్థ పదార్థాల నిర్వహణలో బిహార్ సర్కార్ వైఖరి ఏ మాత్రం సరిగా లేదని ఎన్జీటీ తప్పుపట్టింది. ఈ విషయంలో నితీష్ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేసింది.
ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎన్జీటీ పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం, ట్రిబ్యునల్ తీర్పుల ప్రకారం ఇది చట్టాల ఉల్లంఘనేనని ఎన్జీటీ స్పష్టం చేసింది. అందువల్ల బిహార్ రాష్ట్ర ప్రభుత్వానికి 4 వేల కోట్ల రూపాయలు పర్యావరణ పరిహారాన్ని చెల్లించాల్సిందిగా జరిమానా విధిస్తున్నట్లు ఎన్జీటీ వెల్లడించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోపు రింగ్ ఫెన్స్‌డ్ ఖాతాకు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో నిధులను సంరక్షించేందుకు ఈ రింగ్ ఫెన్స్‌డ్ ఖాతాను ఉపయోగిస్తుంటారు. ఈ అకౌంట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో నిర్వహిస్తుంటారు. సీఎస్ ఆదేశాలతో ఈ అకౌంట్‌లోని డబ్బును వ్యర్థాల నిర్వహణకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీ చైర్ పర్సన్ జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిహార సొమ్ముతో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ సదుపాయాలు, డ్రెయినేజీ నీటి నిర్వహణ కేంద్రాల్లాంటివి ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశించింది.
జాతీయ హరిత ట్రిబ్యునల్.. వ్యవర్థాల నిర్వహణలో వైఫల్యం చెందినందుకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఇలా భారీ మొత్తంలో జరిమానా విధిస్తుంటుంది. గత సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి 3 వేల 500 కోట్ల రూపాయలు పరిహారం కట్టాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. మొన్నా మధ్య పంజాబ్‌లోని లూథియానాలో చోటు చేసుకున్న విషవాయువుల ఘటనపై కూడా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విష వాయువులు పీల్చి వలస కుటుంబాల్లో 11 మంది దుర్మరణం చెందడంపై ఎన్జీటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ట్రిబ్యునల్.. దర్యాప్తు కోసం కమిటీని కూడా నియమించింది.
also read :
Sharwanand: జనవరిలో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న శర్వా ఇంకా పెళ్లి పీటలెక్కడంలేదు ఎందుకు..!
NTR : మళ్లీ బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి.. ఈ సారి రచ్చ వేరే లెవల్‌లో…