Sunishith : ఇటీవల శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ వార్తలలో తెగ నిలుస్తున్నాడు.ఎక్కువగా కాంట్రవర్సీస్‌తో మనోడు వార్తలలో నిలుస్తుంటాడు. తనను తాను హీరోగా చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటాడు. లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నానని, తమన్నాతో డేటింగ్ చేశానని ఒక్కటేమిటి టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లపై షాకింగ్ వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక అతడు ఇలాంటి ప్రవచనాలు వల్లిస్తున్నాడనుకుని పలు యూట్యూబ్ ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూలు వరుసగా తీసుకుంటూ సునిశిత్‌ను మరింత లైమ్ లైట్లోకి తీసుకొచ్చాయి. ఇంక తన నోటికి హద్దు, అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ వివాదానికి తెరలేపాడు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తన్నులు కూడా తిన్నాడు.
సునీషిత్ ని చితకబాదిన రాంచరణ్ అభిమానులు !
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఉపాసన గారి పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలే కారణం#RamCharan #Sunishith pic.twitter.com/39cZIkxPGV
— Daily Culture (@DailyCultureYT) May 13, 2023
ఉపాసన గురించి దారుణంగా మాట్లాడినందుకు మనోడికి మెగా ఫ్యాన్స్ వెతికి పట్టుకొని విపరీతంగా కొట్టారు. ఎంతలా అంటే తనే స్వయంగా ఉపాసన గురించి తప్పుగా మాట్లాడనని, క్షమించాల్సింది అని అనేలా చితకబాదారు అంతటితో ఆగకుండా వాళ్లు సునిశిత్‌కు డబ్బులు కూడా ఇచ్చి ఈ సారి ఎప్పుడూ రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడకూడదని ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.
అయితే ఆ దెబ్బకు మనోడు ఇక మాట్లాడడని అందరు అనుకున్నారు. అయితే సునిశిత్ బుద్ది మారలేదు. ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేశారు. ఎన్టీఆర్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడంతో వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కాస్త అసభ్యంగా కామెంట్స్ చేశాడు సునిశిత్. ప్రస్తుతం ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో కదా.. కానీ ఎన్టీఆర్ అశ్లీల చిత్రాల్లో కూడా నటించారు అంటూ సునిశిత్ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. జూ. ఎన్టీఆర్ గురించి ఈ విషయం టాలీవుడ్ లో ఎవ్వరూ చెప్పరు.. సునిశిత్ అనే హీరో తప్ప అంటూ తన గురించి తానే చెప్పుకుంటూ బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశాడు..
Eesari JR NTR fans chetha kottinchukovalani fix ayinattu unnadu 😂
Confirm chavu ye ra neku 🤦#NTR pic.twitter.com/TWBmcGbJMZ— Samosa Times (@samosatimes7) May 17, 2023
అసలు తాను ఎంతగా దిగజారుతున్నాడో, లేని పోని చిక్కుల్లో పడుతుడో అతనికే అర్ధం కావడం లేదు. రాంచరణ్ ఫ్యాన్స్ తర్వాత చావు దెబ్బలు తిన్నాక కూడా మనోడు మారక పోవడం ఏంటా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. సునిశిత్ కి పాడె రెడీగా ఉంచండి.. కంఫర్మ్ గా నీకు చావేరా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
also read :
Varun Tej:వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ త్వరలోనే.. ఈ వార్త ఎలా వచ్చిందంటే..!
Akhil-RamCharan: రామ్ చరణ్, అఖిల్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ రానుందా.. అసలు విషయం ఏంటంటే..!