NTR: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న అలియా.. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఇప్పుడు ఆ చిన్నారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది.
అయితే తాజాగా అలియా భట్.. ఎన్టీఆర్ పిల్లలు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు దుస్తులను పంపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. అలియా భట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కృతజ్ఞతలు అలియా.. నీ క్లాతింగ్ బ్రాండ్ ఎప్పుడూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాల్లో సంతోషాన్ని నింపుతుంది.
తన పేరు మీద కూడా ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నా అంటూ స్టోరీ షేర్ చేయగా, దీనికి స్పందించిన అలియా.. ‘నీకు మాత్రం ఈద్ స్పెషల్ దుస్తులు సిద్ధం చేస్తానని, స్వీటెస్ట్ పర్సన్ థాంక్యూ అంటూ కామెంట్ చేసింది.