Telugu Flash News

Vedanta: అప్పుల ఊబిలో వేదాంత.. అదానీ బాటలో ప్రయాణం ఖాయమా?

Vedanta Resources Ltd

Vedanta Resources Ltd also in trouble like adani : హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ ఆస్తులు పేక మేడల్లా కూలిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే.. ఇంకా చెప్పాలంటే.. 24 ట్రేడింగ్‌ రోజుల్లోనే అదానీ సంపద సుమారు 12 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో పరిస్థితులు గందరగోళంగా మారాయి. చాలా మంది ఇన్వెస్టర్లు అదానీ షేర్లతో తీవ్రంగా నష్టపోయారు. మరికొందరు ఎప్పటికైనా తిరిగి కోలుకుంటాయన్న ఆశతో షేర్లను అలాగే ఉంచుకుంటున్నారు. అదానీ ఇష్యూతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళన వ్యక్తమైంది.

తాజాగా అదానీ బాటలో ప్రముఖ దిగ్గజ సంస్థ వేదాంత పయనిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేదాంత అధినేత అనిల్‌ అగర్వాల్‌ కూడా మార్కెట్లలో చిన్నపాటి తుఫాన్‌ సృష్టించే ప్రమాదం పొంచి ఉందని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే దిగ్గజ విశ్లేషణ సంస్థ ఎస్‌ అండ్‌ పీ తేల్చి చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు లండన్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో నమోదైన వేదాంత రిసోర్సెస్‌కు అనిల్‌ అగర్వాల్‌ అధిపతి.

anil agarwal

వేదాంత కంపెనీ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తోంది. వచ్చే జనవరిలో 100 కోట్ల డాలర్ల బాండ్లకు గడువు తీరనున్న నేపథ్యంలో రుణాలను ఈ కంపెనీ క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత 11 నెలల్లో నికర అప్పులను 2 బిలియన్‌ డాలర్లు తగ్గించుకుని, 7.7 బిలియన్‌ డాలర్లకు పరిమితం చేసుకుందని తెలుస్తోంది. 2023 సెప్టెంబర్‌ దాకా ఈ సంస్థ చెల్లించాల్సిన లోన్లకు ఇబ్బందేమీ లేకపోయినా.. సెప్టెంబర్‌ నుంచి 2024 జనవరి వరకు తీర్చాల్సిన రుణ, బాండ్ల కోసం 150 కోట్ల డాలర్ల సమీకరణ కోసం అగర్వాల్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, ఇందుకు అడ్డంకులు వచ్చి పడుతున్నాయని తెలుస్తోంది.

ఇక హిందుస్థాన్‌ జింక్‌ వద్ద ఉన్న నగదు నిల్వలను వినియోగించుకోకపోతే తన రుణ సామర్థ్యం తగ్గుతుందని స్వయంగా అగర్వాల్‌ పేర్కొంటున్నారు. అప్పులు తీర్చడానికి మళ్లీ రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమెరికాలోనూ తక్కువ వడ్డీకి తాజాగా అప్పులు పుట్టడం కష్టతరమైన సమస్యగా ఉంది. మరోవైపు ఆస్తుల విక్రయానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే అగర్వాల్‌కు చెందిన సెమీకండక్టర్‌ ఫ్యాక్టరీపై నీలినీడలు కమ్ముకుంటాయనే విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తంగా అదానీ బాటలో షేర్లు, ఆస్తులు కరిగిపోయే ప్రమాదం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

also read : 

Actress Pooja Hegde at Zee Cine Awards 2023 Event

Alia Bhatt at Zee Cine Awards 2023 Photos and Videos

Kiara Advani at Zee Cine Awards 2023 Photos and Videos

Rashmika Mandanna at Zee Cine Awards 2023 Photos and Videos

 

Exit mobile version